హైదరాబాద్ పాతబస్తీ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడ్డాడు రౌడిషీటర్ మహమ్మద్ ఫరిద్. 7 సంవత్సరాలు జైల్లో గడిపిన బుద్ధి మారలేదు అతనికి. 20న కాలాపత్తర్ ప్రాంతంలో ఉండే సయ్యద్ ఖలీల్ అనే వ్యక్తి మసీద్‌కు వెళ్తూ.. బయటి తలుపు మూసి వెళ్లాడు. నమాజుకు వెళ్లి వచ్చి.. చూసే సరికి బయటి తలుపు తెరచి ఉంది.
24 గంటల్లో దొంగను పట్టుకున్న పోలీసులు - Police caught the thief within 24 hours in oldcity
ఓ ఇంట్లో దొంగతనం చేసి పరారైన వ్యక్తిని 24 గంటల్లో పట్టుకున్నారు పాతబస్తీ పోలీసులు. అతని నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్
ఖలీల్‌కు అనుమానం రావడంతో అల్మారా తెరచి చూశాడు. బంగారు ఆభరణాలు కనిపించలేదు. దొంగతమయ్యాయని స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... రౌడిషీటర్ ఫరీద్‌ను పట్టుకున్నారు. అతని నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో దొంగను పట్టుకున్నందుకు బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.
ఇదీ చదవండి:సెంట్రల్ జైలులో ఖైదీలతో సీఎం ముచ్చట