తెలంగాణ

telangana

ETV Bharat / state

రూమర్స్ ఫార్వార్డ్ చేస్తున్నారా - అయితే చిక్కుల్లో పడ్డట్టే!

Police Case Over Rumors Spreading in Social Media : నేటికాలంలో చిన్నాపెద్దా తేడా లేకుండా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండటం సర్వసాధారణం అయింది. నిమిషం వృథా చేయకుండా నెట్టింట్లో గడపాల్సిందే అనేంతగా పరిస్థితి మారిపోయింది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఏమూల ఏం జరిగినా తెలుస్తోంది. ఇందులో కొన్ని వాస్తవాలు, మరికొన్ని అవాస్తవాలు ఉంటున్నాయి. కానీ అసత్య వార్తలకు సామాజిక మాధ్యమాలు వేదికలవుతుండటం ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఇందులో వార్తల్లో నిజముందో లేదో తెలియకుండానే సామాన్యులు వాటిని ఫార్వాడ్​ చేస్తున్నారు. తద్వారా చిక్కుల్లో పడుతున్నారు. ఇలాంటి వాటిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

Police Warning to Fake Posting in Social Media
Fake Posting in Social Media

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2023, 11:57 AM IST

Police Case Over Rumors Spreading in Social Media :అరచేతిలో ఫోన్‌ ఉందని, అంతర్జాలం(Data) చవకగా అందుబాటులో ఉంది కదా అని వచ్చిన మెసేజ్​లను వచ్చినట్లు ఫార్వర్డ్ చేస్తున్నారా? వాటిలో నిజముందో లేదో తెలుసుకోకుండానే ఇతర గ్రూపులకు ఫార్వర్డ్‌ చేస్తే చిక్కుల్లో పడతారు. ఇలాంటి వాటిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇకపై ఇలా చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే నకిలీ వార్తలు, మెసేజ్​లను వ్యాప్తి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఒకవేళ నేరం నిరూపితమైతే మూడేళ్ల శిక్ష కూడా పడేందుకూ ఆస్కారం ఉంది.

Fake News Forwarding in Social Media :ప్రస్తుతం ప్రజలకు నిత్య జీవితంలో సోషల్​ మీడియాతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఇదే అదనుగా తీసుకుని కొందరు వాస్తవాల కంటే వదంతులను ఎక్కువగా వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా ఇబ్బందులు తలెత్తుతుండటంతో, వాటిని కట్టడి చేసేందుకు పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

జాతీయ నేరాల నమోదు సంస్థ(NCRB) నివేదిక ప్రకారం, గత ఏడాది నకిలీ వార్తలు, సమాచార వ్యాప్తిపై అత్యధిక కేసులు తెలంగాణలోనే నమోదు అయ్యాయి. గత సంవత్సరం నకిలీ వార్తల ప్రచారానికి సంబంధించి రాష్ట్రంలో 264 కేసులు, రెండో స్థానంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో 147 కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద ఈ తరహా కేసులు 858 నమోదు కాగా, ఇందులో నాలుగోవంతు ఒక్క తెలంగాణలోనివే కావడం విశేషం.

సోషల్ మీడియాలో జాగ్రత్త, అపరిచితులతో జాగ్రత్త అంటున్న పోలీసులు

డీప్‌ ఫేక్‌ పరిజ్ఞానం దుర్వినియోగంతో..:సాంకేతిక విప్లవం సోషల్​ మీడియాను సామాన్యుడికి చేరువ చేసింది. సులభంగా వాడే అవకాశం రావడంతో రకరకాల ప్రచారాలకు తెరలేస్తోంది. ప్రజల అభిప్రాయాలను సైతం మార్చే స్థాయికి ఈ సోషన్​ మీడియా చేరుకుందంటే అతిశయోక్తి కాదు. దీనికి డీప్‌ ఫేక్‌(Deep Fake) వంటి పరిజ్ఞానం తోడవడంతో ఏ విషయాన్నైనా సరే తమకు కావాల్సిన విధంగా మార్పులు చేసి, సామాజిక మాధ్యమాల్లో గుప్పించడం సర్వసాధారణంగా మారింది. ఇటీవల ఓ హీరోయిన్‌కు సంబంధించిందంటూ, సృష్టించిన డీప్‌ ఫేక్‌ వీడియో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

Fake News Spread in Social Media :అనని విషయాన్ని అన్నట్లుగా చిత్రీకరిస్తుండటంతోనూ చాలావటికి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మతాలు, వర్గాల మధ్య వైరం సృష్టించేందుకు కొందరు పనిగట్టుకొని మరి వదంతులను సృష్టిస్తుంటారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా సోషల్​ మీడియాను ప్రత్యర్థులపై దుష్ప్రచారానికి ఆయుధాలుగా మలచుకుంటున్నాయి. వదంతులు వ్యాప్తి చేయడం భారతీయ శిక్షా స్మృతి(IPC) సెక్షన్‌ 505 ప్రకారం నేరం. దీనికి ఐటీ చట్టం జోడించి, వ్యాప్తికి పాల్పడుతున్న వాపిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. నేరం నిరూపితమైతే మూడేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉంది.

Police Said to Be Careful on Social Media :తెలంగాణలోనే కొన్ని సంఘటనలను పరిశీలిస్తే, ఓ మహిళా రాజకీయ నేతకు విదేశాల్లో ఖరీదైన ఇళ్లు ఉన్నాయంటూ తమ యూట్యూబ్‌ ఛానల్లో ప్రసారం చేసినందుకు హైదరాబాద్‌, హుజూరాబాద్‌లకు చెందిన ఇద్దరు విలేకరులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఓ కలెక్టర్‌కు కరోనా వచ్చిందని ప్రచారం చేసిన వ్యక్తిపై నిర్మల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకప్పుడు ఇలాంటి వదంతులు వ్యాప్తి చేసినా చాలామంది చూసీచూడనట్లు వ్యవహరించేవారు, కానీ ఇప్పుడు ఎవరికివారు కేసులు పెట్టేందుకు సైతం సిద్ధమవుతున్నారు. దీంతో తప్పుడు వార్తల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వార్తలను సృష్టించడమే కాదు వాటిని ప్రచారం చేసినా పోలీసులకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్న విషయం ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాలి.

Viral News : భర్త చనిపోయినట్టు ఫేక్ పోస్ట్.. అది చూసి భార్యకు షాక్.. చివరికి ఏమైదంటే

ABOUT THE AUTHOR

...view details