తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు - ప్రభాకర్​రెడ్డిపై దాడి చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డితో పాటు మరికొంత మంది వైకాపా నాయకులపై తాడిపత్రి పట్టణ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​రెడ్డి ఇంటిపై దాడి ఘటనలో ఈ మేరకు కేసులు నమోదయ్యాయి.

ఏపీ: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు
ఏపీ: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

By

Published : Dec 27, 2020, 10:45 AM IST

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఈ నెల 24న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి మారణాయుధాలతో ప్రవేశించారని కేసు నమోదైంది. పెద్దారెడ్డి కుమారుడు, అనుచరులపై కూడా కేసులు నమోదయ్యాయి.

న్యాయవాది శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంటిపై రాళ్లు రువ్విన ఘటనలో పెద్దారెడ్డి కుమారుడిపై కేసు నమోదవ్వగా.. జేసీ ప్రభాకర్ రెడ్డి కారును ఢీ కొట్టి హత్యాయత్నం చేశారని పెద్దారెడ్డి అనుచరులపై కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ సీఐ తేజోమూర్తి తెలిపారు.

ఇదీ చదవండి:గిఫ్ట్​ల ఎర చూపి... ఆస్తులమ్ముకునేలా చేస్తారు...!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details