తెలంగాణ

telangana

ETV Bharat / state

అనాథ శవానికి ఆత్మ బంధువులై...! - రాంబిల్లిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

మూడు రోజుల కిందట సముద్ర తీరానికి ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. దానిని గుర్తించేందుకు ఎవరూ రాలేదు. శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. దీంతో పోలీసులే మృతదేహాన్ని మూడు కిలోమీటర్ల సముద్రతీరం వెంబడి మోసుకొచ్చి..మార్చురీలో భద్రపరిచారు. ఈ ఘటన ఏపీలోని విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలో జరిగింది.

police
పోలీసులు

By

Published : Mar 27, 2021, 9:07 PM IST

ఏపీలోని విశాఖ జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెం సముద్ర తీరానికి మూడు రోజుల కిందట ఓ శవం కొట్టుకొచ్చింది. రెవెన్యూ సిబ్బంది గుర్తించి పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి చుట్టుపక్కల గ్రామాలకు, మండల పోలీసులకు సమాచారమిచ్చారు. ఎవరూ రాకపోవటంతో అనాథ శవంగా గుర్తించారు.

సుమారు మూడు రోజులు కావడం వల్ల మృతదేహం కుళ్ళిపోయి దుర్వాసన వస్తోంది. సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీసులే మృతదేహాన్ని మూడు కిలో మీటర్లు మోసుకొచ్చి ఎలమంచిలి మార్చురీలో భద్రపరిచారు. రాంబిల్లి ఎస్​ఐ అరుణ్ కిరణ్, అతని సిబ్బంది ఇందులో పాలుపంచుకున్నారు.

పోలీసులు

ఇదీ చదవండి:రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్​ను గెలిపించండి: జానారెడ్డి

ABOUT THE AUTHOR

...view details