తెలంగాణ

telangana

కాలిబాటన స్వస్థలాలకు వలస కూలీలు... అడ్డుకున్న పోలీసులు

By

Published : May 4, 2020, 11:56 PM IST

వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా... కొందరు కార్మికులు ఇంకా కాలినడకనే స్వస్థలాలకు వెళ్తున్నారు. జార్ఖండ్​, బీహార్​, యూపీ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు శంషాబాద్​ నుంచి కాలిబాటన వస్తుండగా బహదూర్​పురా, జూపార్క్​ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు.

వలస కూలీలు
వలస కూలీలు

శంషాబాద్ నుంచి కాలినడకన సొంతూళ్లకు వెళ్తున్న జార్ఖండ్​, బీహార్​, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాలకు చెందిన దాదాపు వేయి మంది వలస కార్మికులను బహదూర్​పురా, జూ పార్క్ వద్ద... హైదరాబాద్ కాలాపత్తర్, బహదూర్ పుర పోలీసులు వారిని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న శంషాబాద్ డీసీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తిలు తమ సిబ్బంది తో బహదూర్​పురా చేరుకున్నారు. వలస కార్మికులకు నచ్చ జెప్పి బస్సులను ఏర్పాటు చేసి తిరిగి వారిని శంషాబాద్​కు తరలించారు.

తమకు జీతాలివ్వడం లేదని... తమ వద్ద ఉన్న డబ్బులు సైతం అయిపోయాయని వలస కార్మికులు తెలిపారు. కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని... సరైన సమయానికి తమకు భోజనం కరువైందన్నారు. పోలీసులు పలు మార్లు తమ వివరాలు సేకరించినప్పటికీ... తమను స్వస్థలాలకు పంపించకపోవడం వల్లే తాము రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

కాలిబాటన స్వస్థలాలకు పయనమైన వలస కూలీలు... అడ్డుకున్న పోలీసులు

ఇవీ చూడండి: ఉత్కంఠ వీడేనా? లాక్​డౌన్​పై మంగళవారం మంత్రివర్గ భేటీ

ABOUT THE AUTHOR

...view details