అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీల ముగింపు వేడుకలు సికింద్రాబాద్ రైల్వే క్రీడా మైదానంలో నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న బ్యాండ్ పోటీల ముగింపు వేడుకలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగీతం మన పూర్వ కాలం నుంచి వస్తుందని....కఠినమైన హృదయాన్ని కూడా కరిగించే శక్తి సంగీతానికే ఉందని తెలిపారు.
'కఠిన హృదయాలను కరిగించే శక్తి సంగీతానిది..' - Police Band Final Event Attend vice president of India
ఫ్రెండ్లీ పోలిసింగ్ కోసం పోలీసుల్లో ఇంకా మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఎవరికైనా సమస్య ఎదురైనా మొదట పోలీస్ స్టేషన్‌కే వెళ్తారని...అక్కడ ఫిర్యాదుదారులతో వారి ప్రవర్తన తీరు బాగుండాలని సూచించారు.

పోలీస్ బ్యాండ్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి
సంగీతం మనిషిలోని సృజనాత్మకతను బయటకు తీస్తుందని గుర్తుచేశారు. పూర్వ కాలంలో రాజుల ధీరత్వాన్ని వారి విజయాన్ని తెలపడం కోసం బ్యాండ్‌ను ఉపయోగించేవారని గుర్తుచేశారు. రిపబ్లిక్ డే రోజున మార్చ్‌లో పోలీస్ బ్యాండ్ వాయిస్తే మనలో ఉత్తేజం కలుగుతుందని పేర్కొన్నారు. మన యాస, భాష వేరైనప్పటికీ మనందరం భారతీయులమేనని వెల్లడించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల పోలీస్ బ్యాండ్లు ఆకర్షణీయంగా నిలిచాయి. బ్యాండ్ వాయించటంలో ప్రతిభ చూపిన బృందాలకు ఉపరాష్ట్రపతి మొమోంటోలు అందజేశారు.
పోలీస్ బ్యాండ్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి
TAGGED:
పోలీస్ బ్యాండ్ ముగింపు