వరదసాయం కోసం మీసేవ కేంద్రానికి వచ్చిన వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీకి పనిచెప్పారు. వరుసలో నిలుచున్న వారిపై విచక్షణారహితంగా దాడిచేశారు.
మీసేవ వద్ద వృద్ధులపై పోలీసుల లాఠీఛార్జ్ - హైదరాబాద్ సమాచారం
నగరంలోని ఓ మీ సేవ కేంద్రం వద్ద పోలీసులు రెచ్చిపోయారు. వరదసాయం కోసం దరఖాస్తు చేసేందుకు వచ్చినవారిని విచక్షణారహితంగా కొట్టారు. వరుసలో ఉన్న ఓ వృద్ధులపై లాఠీతో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో ఈ ఘటన జరిగింది.
మీసేవ వద్ద వృద్ధునిపై పోలీసుల లాఠీఛార్జ్
హైదరాబాద్‌లోని టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో మోహిని ఫంక్షన్‌హాల్ సమీపంలో బాలాజీ మీ సేవ కేంద్రం వద్ద ఘటన జరిగింది. అక్కడే వరుసలో ఉన్న ఎంఏ ఖాన్ అనే వృద్ధునిపై లాఠీతో విరుచుకుపడ్డారు. దీంతో అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.