కూరగాయలు అమ్ముకునే ఓ చిరు వ్యాపారిపై బంజారాహిల్స్ పోలీసులు ప్రతాపం చూపించారు. ఉదయం 10 గంటలకే దుకాణం మూసివేసినప్పటికీ వారికి కూరగాయలు ఇవ్వకపోవడంతో తనను కొట్టి ఠాణాకు తీసుకువచ్చారని బాధితుడు మున్నా యాదవ్ వాపోయారు.
కూరగాయల వ్యాపారిపై పోలీసుల దురుసు ప్రవర్తన - వ్యాపారి పోలీసుల దురుసు ప్రవర్తన
లాక్ డౌన్ సమయంలో కూరగాయలు ఇవ్వనందుకు వ్యాపారిపై పోలీసులు ప్రతాపం చూపారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పరిధిలోని నందినగర్‌లో ఈ సంఘటన జరిగింది. సమయం ముగిశాక వచ్చినందుకు తాను ఇవ్వలేకపోయానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు
కూరగాయల వ్యాపారి మున్నాయాదవ్
నగరంలోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని నందినగర్‌లో మున్నాయాదవ్ కొన్నేళ్లుగా కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల తన దుకాణం మూసివేశానని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన పోలీసులకు కూరగాయలు ఇవ్వకపోవడంతో తనను కొట్టి పీఎస్‌కు తీసుకొచ్చారని మున్నా యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.