హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మల్లెపల్లి కూడలి వద్ద ఆదివారం రాత్రి ఓ ఘటన జరిగింది. ఇద్దరూ కాటికాపరులు అన్నం తినేందుకు రాత్రి పదిగంటలకు నాంపల్లి వైపు వెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు యువకులను ఆపారు. కర్ఫ్యూ సమయంలో, ఈ సమయానికి ఎక్కడికి వెళ్తున్నారంటూ ప్రశ్నించారు. తినేందుకు వెళ్తున్నామని చెప్పగా.. ఇప్పుడు షాప్‌లు ఎక్కడ ఉంటాయంటూ పోలీసులు వారిపై దురుసుగా ప్రవర్తించారు.
యువకులను పోలీసులు కొడుతున్న దృశ్యాలను కొందరు చరవాణీలో చిత్రీకరించారు. మల్లెప్లలి స్మశానవాటికలో కాటికాపరులుగా పనిచేస్తున్నామని... కరోనా వలన మృతి చెందిన వారిని దహనం చేయడం వల్లే ఆలస్యమైందని చెప్పినా... పోలీసులు వినిపించుకోలేదని కాటికాపరులు వాపోయారు. భోజనం చేసేందుకు వస్తే విచక్షణారహితంగా చావబాదారంటూ వాపోయారు.
మృతదేహాల దహనం
ఈ ఘటనలో తప్పు ఎవరిది. కరోనా విజృంభిస్తున్న వేళ.. సొంతవారు చనిపోయినా నిర్ధాక్ష్యణంగా కొందరు వారి మృతదేహాలను వదిలి వెళ్లిపోతున్నారు. అలాంటి సమయంలో కాటికాపరులే వాటిని దహనం చేస్తున్నారు. వారంటూ లేకపోతే ఎన్ని మృతదేహాలు రోడ్డునపడి దహన సంస్కారాల కోసం ఎదురు చూసేవో అనిపిస్తోంది.
విధుల్లోనే జీవనం
కరోనా కట్టడిలో భాగంగా పోలీసులు 24 గంటలు విధుల్లోనే ఉంటున్నారు. చాలా మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలంతా పడుకున్నా.. రాత్రి వేళ కర్ఫ్యూ విధుల్లో ఉంటూ రక్షణ కల్పిస్తున్నారు. అలాంటి సమయంలో ఇద్దరు యువకులు బీరు తాగి బయట తిరుగుతున్నారనే ఆలోచించి కొట్టి ఉండొచ్చు. కానీ బయటకు వచ్చిన వారు ఏ పరిస్థితుల్లో వచ్చారో తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది.
విధుల్లో పోలీసులు.. ఆకలి బాధల్లో యువకులు ఇదీ చూడండి:లక్షణాల్లో తికమక.. ఆఖరి నిమిషంలో ఆగమాగం