ఓ విలేకరిపై దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట సమీపంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై జరిగింది. చంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కరోనా నేపథ్యంలో లాక్డౌన్ ప్రస్తుత పరిస్థితులపై కవరేజ్ కోసం రిపోర్టర్ సలీం వెళ్లారు.
కవరేజ్ కోసం వచ్చిన రిపోర్టర్‌పై పోలీసుల దాడి - హైదరాబాద్ తాజా వార్తలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 31 వరకు లాక్డౌన్ విధించారు. ఈ సందర్భంగా ప్రజలు బయట తిరగకూడదని ఆంక్షలు విధించారు. మీడియా, వైద్యం, నిత్యవసర దుకాణాలు, పోలీసులకు మినహాయింపు ఇచ్చారు. కానీ బయటకు వచ్చిన మీడియా సిబ్బందిపై పోలీసులు విరుచుకుపడ్డారు. రిపోర్టర్ అని చెప్పినా వినకుండా దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నడిబొడ్డులో జరిగింది.
కవరేజ్ కోసం వచ్చిన రిపోర్టర్‌పై పోలీసుల దాడి
అది గమనించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు చితకబాదారు. రిపోర్టర్ అని చెప్పిన తర్వాత కూడా దాడి చేశారని సలీం కంటతడి పెట్టుకున్నారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు నడుము, భుజంపై గాయాలయ్యాయి.
ఇదీ చూడండి :'అధిక ధరలకు విక్రయిస్తే ఆ నంబర్‌కు కాల్ చేయండి'
Last Updated : Mar 24, 2020, 7:16 AM IST