తెలంగాణ

telangana

ETV Bharat / state

జైలు నుంచి రామచంద్ర భారతి, నంద కుమార్ విడుదల.. వెంటనే మళ్లీ అరెస్టు - జైలు నుంచి విడుదలైన రామచంద్రభారతి

Ramachandra and Nanda kumar arrested
Ramachandra and Nanda kumar arrested

By

Published : Dec 8, 2022, 8:24 AM IST

Updated : Dec 8, 2022, 1:51 PM IST

06:26 December 08

జైలు నుంచి రామచంద్ర భారతి, నందకుమార్ విడుదల.. వెంటనే మళ్లీ అరెస్టు

Ramachandra and Nanda Kumar arrested : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎరవేసిన వ్యవహారం విచారణ వేళ చంచల్‌ గూడ జైలు వద్ద ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అరెస్టు అయి.. నెలన్నర కాలంగా జైలులో ఉన్న నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్‌.. విడుదలైన వెంటనే పోలీసులు వారిని ఇతర కేసుల్లో అరెస్టు చేశారు. కారాగారం నుంచి తమ వస్తువులతో ఇద్దరూ బయటికి రాగా.. అప్పటికే గేటు వద్ద పోలీసులు కాపు కాశారు. నిందితులిద్దరూ గేటు దాటిన వెంటనే అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో ఇద్దరినీ ఎక్కించారు.

విచారణ ఖైదీలుగా చంచల్‌గూడ జైలులో ఉన్న ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయటంతో పూచీకత్తు సమర్పణ అనంతరం, నిన్న సింహయాజీ బయటికొచ్చారు. ప్రధాన నిందితులైన రామచంద్ర భారతి, నందకుమార్‌లు ఇవాళ ఉదయం విడుదలయ్యారు. కాగా.. ఇద్దరిపైనా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వేర్వేరు కేసులుండగా.. నందకుమార్‌పై ఇతర స్టేషన్లలోనూ కేసులున్నాయి.

రామచంద్ర భారతి వేరు వేరు పేర్లు, చిరునామాలతో రెండు పాస్​పోర్టులు కలిగి ఉన్నాడని రాజేంద్రనగర్ ఏసీపీ బంజారాహిల్స్ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు నందకుమార్​పై బంజారాహిల్స్ ఠాణాలోనే 5 ఛీటింగ్ కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ పీఎస్​లో ఫోర్జరీ కేసు నమోదైంది. రాజేంద్రనగర్ ఠాణాలో నందకుమార్​పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గత నెల 24న మెదక్ జిల్లా గజవాడకు చెందిన బాలయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రూ.80 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్న బాలయ్య.. డబ్బులు అడిగితే ఇవ్వకుండా కులం పేరుతో దూషించినట్లు ఫిర్యాదులో తెలిపారు.

నందకుమార్​పై రాజేంద్రనగర్ పీఎస్​లోనే 2017లో నమోదైన మరో ఛీటింగ్ కేసు ఉండగా.. అమీర్​పేట ఎక్సైజ్ పోలీస్​స్టేషన్​లోనూ 2018లో మరో కేసు నమోదైంది. దీంతో నందకుమార్​పై పీడీ యాక్టు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఈ కేసుల్లో ఇద్దరినీ విచారించేందుకు కారాగారం నుంచి బయటికొచ్చిన మరుక్షణమే పోలీసులు వీరిని అరెస్టు చేశారు.

మరోవైపు తాను 40 రోజులు జైల్లో ఉన్నానని.. ఏం జరుగుతుందో తెలియడం లేదని జైలు నుంచి విడుదలయ్యాక నందకుమార్‌ వ్యాఖ్యానించారు. ఈ కేసుల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మాట్లాడతానని ఆయన తెలిపారు.

ఇవీ చూడండి..

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇద్దరు నిందితులకు బెయిలు మంజూరు

దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసు.. ఎంపీ సోదరుడిని విచారించనున్న ఈడీ..!

Last Updated : Dec 8, 2022, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details