హైదరాబాద్ ఎల్బీనగర్ గో సడక్ బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక తరహాలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం తేవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర సీఎం గోమాతను రాష్ట్రీయ ప్రాణిగా ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న గోవధను అరికట్టాలని పేర్కొన్నారు. సీఎం స్పందించే వరకు ఉద్యమం ఆగదని తెలిపారు.
గోసడక్ బంద్‌లో పాల్గొన్న రాజాసింగ్.. అరెస్టు చేసిన పోలీసులు - News of the arrest of MLA Rajasinghe
హైదరాబాద్ ఎల్బీనగర్‌లో గోసడక్ బంద్‌లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. ముందస్తుగా రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
గో సడక్ బంద్‌లో పాల్గొన్న రాజాసింగ్.. అరెస్టు చేసిన పోలీసులు
సడక్ బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన భాగ్యనగర ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతరావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గోమాతను వదిస్తే.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి: 'గో సడక్ బంద్' నేపథ్యంలో ముందస్తు అరెస్టులు
Last Updated : Jan 8, 2021, 2:25 PM IST