Police Arrested Drug Gang in Hyderabad : భాగ్యనగరంలో మరోసారి భారీగా డ్రగ్స్(Drug)పట్టివేత హడలెత్తిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నా డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారుల్లో మార్పు వస్తున్న దాఖలాలు కానరావడం లేదు. కొందరు యువకులు గోవా నుంచి తెప్పించిన ఖరీదైన డ్రగ్స్‌తో మునిగితేలుతుండగా టీఎస్ న్యాబ్, ఎస్ఆర్ నగర్ పోలీసులు దాడి చేశారు. హైదరాబాద్‌లో పుట్టిన రోజు వేడుకల కోసం గోవా నుంచి డ్రగ్స్ తెప్పించి వినియోగిస్తున్నట్టు తెలియటంతో ప్రధాన నిందితుడు ఆశిక్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడిచ్చిన సమాచారంతో మరో నిందితుడు రాజేష్ సహా 12 మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు.
పబ్బుల్లో డాగ్స్‌తో పోలీసుల తనిఖీలు - పట్టుబడితే కష్టమే మరీ
TSNAB Focus on Drugs Control in Telangana : ఉద్యోగ వేటలో హైదరాబాద్ వచ్చిన నెల్లూరుకి చెందిన ఆశిక్ యాదవ్ అతని స్నేహితులు రాజేష్, సాయిచరణ్ తో కలిసి తరచూ గోవా వెళ్తున్నాడు. దీంతో అక్కడ డ్రగ్ ముఠాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని బాబా అనే వ్యక్తి వద్ద ఎక్స్‌టాసీ బిళ్లలు కొనుగోలు చేసి నగరంలో అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. డబ్బుకోసం ఉద్యోగాలు మానేసి మరీ ముగ్గురూడ్రగ్స్ దందాలో దిగారు.
ఈనెల 12న ఆశిక్‌యాదవ్, రాజేశ్‌యాదవ్, సాయిచరణ్ గోవాలో 60 ఎక్స్‌టాసీ పిల్స్ కొనుగోలు చేశారు. ఒక్కొక్కరు 20 చొప్పున పంచుకున్నారు. 18 పిల్స్ విక్రయించిన ఆశిక్ మిగిలిన రెండు పిల్స్ విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. రెండ్రోజుల క్రితం అమీర్‌పేట్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో కొందరు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వేడుకలో పాల్గొన్న యువకుల కోసం డ్రగ్స్ చేరవేసినట్టు సమాచారం అందటంతో టీఎస్ న్యాబ్ బృందం, ఎస్ఆర్ నగర్ పోలీసులతో కలిసి తనిఖీ చేసి ఆశిక్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారంతో మరో సరఫరాదారుడు రాజేష్‌ను అరెస్టు చేసిన పోలీసులు తరచూ వీరిని సంప్రదిస్తూ ఉండే 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేలా - టీఎస్ న్యాబ్ బలోపేతానికి అధికారుల ప్రణాళిక