Police arrested CPI leaders: ప్రధాని పర్యటనలో నిరసనలు తెలుపుతామని పలు పార్టీలు, ప్రజాసంఘాలు చేసిన ప్రకటనలతో అప్రమత్తమైన పోలీసులు.. నిరసన తెలిపే నాయకులు, శ్రేణుల్ని ముందుస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. నిరసనలకు పిలుపునిచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు ప్రజాసంఘాలు, బొగ్గుగని కార్మికసంఘం నేతల్ని అరెస్ట్ చేసి మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పోలీస్ స్టేషన్ తరలించారు.
ప్రధాని పర్యటన దృష్ట్యా.. ముందస్తుగా పలువురు అరెస్టు - మోదీ రాష్ట్ర పర్యటన
Police arrested CPI leaders: ప్రధాని పర్యటనలో నిరసనలు తెలుపే నాయకులు, శ్రేణుల్ని పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. రామగుండంలో ప్రధాని పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నారు.
![ప్రధాని పర్యటన దృష్ట్యా.. ముందస్తుగా పలువురు అరెస్టు Police arrested CPI leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16906367-792-16906367-1668232937757.jpg)
మోదీ రాష్ట్రానికి ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలంటూ జైపూర్ పోలీస్ స్టేషన్‌లోనూ నేతలు నిరసన కొనసాగిస్తున్నారు. రామగుండంలో ప్రధాని పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నారు. మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో నిరసనలకు పిలుపునిచ్చిన టీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఓయూ క్యాంపస్ హాస్టల్‌లలో ఉన్న టీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి ఉస్మానియా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విభజన హామీలు నెరవేర్చి తెలంగాణలో అడుగు పెట్టాలంటూ, మోదీ గో బ్యాక్ అని విద్యార్థి నేతలు నినాదాలు చేశారు.
ఇవీ చదవండి: