తెలంగాణ

telangana

ETV Bharat / state

అసెంబ్లీ ముట్టడికి సీపీఐ పిలుపు.. పోలీసుల ముందస్తు అరెస్టులు

అసెంబ్లీ ముట్టడికి సీపీఐ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు.

CPI calls for assembly siege
అసెంబ్లీ ముట్టడికి సీపీఐ పిలుపు

By

Published : Oct 13, 2020, 10:59 AM IST

పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు.. రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ నాయకులను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్​లో నారాయణ, చాడ వెంకట్ రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details