తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉస్మానియా సమీపంలోని హత్య కేసులో... నిందితుడి అరెస్టు' - ఉస్మానియా విద్యాలయం హత్య కేసు

మంగళవారం ఉస్మానియా సమీపంలోని చెరువులో జరిగిన హత్యకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి బావమరిది అయిన చందును బండరాయితో మోది హత్య చేసినట్లు ఉస్మానియా సీఐ రాజశేఖర్​ రెడ్డి తెలిపారు.

ఉస్మానియా హత్యకేసు

By

Published : May 2, 2019, 9:38 PM IST

ఉస్మానియా విశ్వవిద్యాలయం చెరువు సమీపంలో మంగళవారం జరిగిన హత్యలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మద్యం మత్తులో తిరుపతి రెడ్డి అనే వ్యక్తి బావ మరిది అయిన చందును బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కూలీ చేసుకుంటున్న ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. చందు సోదరిని తిరుపతిరెడ్డి రెండో వివాహం చేసుకున్నాడు. చందు తరచూ నిందితుడితో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో కూలి చేస్తున్న చందుని తిరుపతిరెడ్డి మద్యం సేవిద్దామని తీసుకెళ్లి ఉస్మానియాలోని చెరువు సమీపంలో హత్య చేశాడని ఉస్మానియా విశ్వవిద్యాలయం సీఐ రాజశేఖర్​రెడ్డి తెలిపారు. నిందితుడిని రిమాండుకు తరలించామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details