Man arrested for taking videos of women bathing: మహిళల రక్షణకు ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన వారిపై జరిగే అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఇంట, బయట అని తేడా లేకుండా సగటు మహిళ ఏదో ఒక సందర్భంలో వేధింపులకు గురవుతోంది. చిన్న పిల్లలు మొదలుకొని.. ఆరు పదులు వయస్సు ఉన్న వృద్ధురాలు సైతం వేధింపులకు గురవుతున్నారు. అత్యాచారం, లైగింక వేధింపులు, వికృత చేష్టాలతో విసుగుపోతున్నారు. కొందరు వారి నుంచి తప్పించుకొని తిరుగుతుంటే.. మరి కొందరు పరువుపోతుందని బయటకు చెప్పకుండా జీవితం అలా కొనసాగించేస్తున్నారు. కొందరు బయటకు వచ్చి ధైర్యంగా న్యాయం కోసం పోరాడుతున్నారు.
సికింద్రాబాద్లో కూడా ఇలానే మహిళలను టార్గెట్ చేసి వారు స్నానాలు చేస్తున్న దృశ్యాలను వీడియోలు తీస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకి ఏం జరిగిందంటే.. పట్టణానికి ఆంటోని అనే వ్యక్తి మహిళలు స్నానం చేస్తుండగా.. దొంగచాటుగా బాత్రూంలు పైకి ఎక్కి తన సెల్ఫోన్లో వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. వాటిని అడ్డుపెట్టుకొని అతగాడు తరువాత ఏం చేద్దామని అనుకున్నాడో తెలియదు గానీ.. ఇంతలోనే స్థానికుల కంట పడ్డాడు. ఇంకేముంది ఆంటోనీని పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేశారు. సెల్ఫొన్ లాక్కొని.. పెద్ద మనిషిలా ఉన్నావు.. చూస్తే పద్దతిగా ఉన్నావు ఇదేం పాడుపని అంటూ తిట్టల దండకం మొదలు పెట్టారు.
అక్కడితో ఆగకుండా పొడువాటి తాళ్లను తీసుకొని కాళ్లు చేతులు కట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఆంటోనీని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఆకతాయిలను కఠినంగా శిక్షించాలని ఇలాంటి వారి కారణంగా తమకు రక్షణ లేకుండా పోయిందని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: