తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వేళ.. భాగ్యనగరంలో నకిలీ వైద్యుల లీల

అతను చదవింది పదో తరగతే. కానీ ఎంబీబీఎస్ చేసినట్లు నకిలీ సర్టిఫికేట్లు సృష్టించాడు. అంతేనా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రోగులకు చికిత్స కూడా చేస్తూ... పోలీసులకు పట్టుబడ్డాడు.

fake doctor arrested in hyderabadd
నకలీ వైద్యుడిని పట్టుకున్న పోలీసులు

By

Published : Jul 19, 2020, 3:07 PM IST

Updated : Jul 19, 2020, 5:31 PM IST

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదివింది పదవ తరగతే అయినప్పటికీ... వైద్యుడిగా అవతారమొత్తాడు. అంతేనా ఆసిఫ్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నాడు.

పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు ఆ ఆస్పత్రిపై దాడి చేసి నకిలీ వైద్యుడితోపాటు ఆసుపత్రి యాజమాని షోహెబ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఆసీఫ్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.

ఇవీ చూడండి:'ఒక్కసారి మా నాన్నను చూడనివ్వండి.. ప్లీజ్'

Last Updated : Jul 19, 2020, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details