YS Sharmila Arrest : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని వైతెపా అధ్యక్షురాలు వెఎస్ షర్మిల డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలో టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించి... ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు... షర్మిలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
YS Sharmila Arrest: వైఎస్ షర్మిల అరెస్ట్ - తెలంగాణ జాబ్ నోటిఫికేషన్ల వ్యవహారం
14:54 February 15
వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు
13:25 February 15
వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు
హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు వైఎస్ షర్మిల ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున వచ్చిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు... ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... రోడ్డు పై బైఠాయించారు. సుమారు గంట సేపు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.
షర్మిల అరెస్ట్
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గమని షర్మిల ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డిని కలిసి నోటిఫికేషన్లపై షర్మిల వినతి పత్రం అందజేశారు. నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ... రోడ్డుపై బైఠాయించిన షర్మిలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
మనదేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని... దానికి కారణం ప్రధాని మోదీ అని సీఎం కేసీఆర్ అంటున్నారు. మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య మీకు కనిపించడం లేదా? నిరుద్యోగంతో బాధపడి చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక్కనాడైనా మీరు భరోసా కలిగించే మాట మాట్లాడారా? రాష్ట్రవ్యాప్తంగా లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు భర్తీ చేయడం లేదు. నిరుద్యోగ భృతి అన్నారు. మరి ఎంతమందికి ఇచ్చారు?
-వైఎస్ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు
ఇదీ చదవండి:కల్వకుంట్ల రాజ్యాంగం అమలైతే రిజర్వేషన్లు రద్దు ఖాయం: బండి సంజయ్