హైదరాబాద్ పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం ముందు మహిళా కాంగ్రెస్ చేపట్టిన ధర్నాను(Congress protest fuel price hike) పోలీసులు అడ్డుకున్నారు. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ధర్నా చేసేందుకు వస్తున్న మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లుగానే అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.
Congress protest fuel price hike: మహిళా కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా.. 8మంది అరెస్ట్ - తెలంగాణ వార్తలు
సివిల్ సప్లయ్ కార్యాలయం ఎదుట మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన(Congress protest fuel price hike) చేపట్టారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. ఎనిమంది మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు.
మహిళా కాంగ్రెస్ ధర్నా, పెరిగిన ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా
ముందుగా వచ్చిన 8మంది మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. సివిల్ సప్లయి భవన్ ముందు పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఇదీ చదవండి:Etela rajender land issues: మళ్లీ తెరపైకి ఈటల భూముల వ్యవహారం.. నోటీసులు జారీ