తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులకు ప్రత్యేక అలవెన్స్‌ రద్దు.. మావోయిస్టు కార్యకలాపాలు తగ్గడమే కారణమా? - పోలీసులకు ప్రత్యేక అలవెన్స్‌ రద్దు

Police Allowance: పోలీస్‌ శాఖలో కానిస్టేబుళ్ల నుంచి ఎస్సై, సీఐల వరకు ఇస్తున్న 15 శాతం ప్రత్యేక అలవెన్స్‌ను పలు జిల్లాల్లో రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

police-allowance-15-percent-stopped-by-government
police-allowance-15-percent-stopped-by-government

By

Published : Jul 24, 2022, 5:18 AM IST

Police Allowance: పోలీస్‌ శాఖలో కానిస్టేబుళ్ల నుంచి ఎస్సై, సీఐల వరకు ఇస్తున్న 15 శాతం ప్రత్యేక అలవెన్స్‌ను ప్రభుత్వం పలు జిల్లాల్లో రద్దు చేసింది. మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజధాని మినహా మిగిలిన ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో ఈ అలవెన్స్‌ ఉండేది. మావోయిస్టుల ప్రభావం విపరీతంగా ఉన్న కాలంలో శాంతిభద్రతల విభాగం, ఏఆర్‌, ప్రత్యేక పోలీస్‌విభాగాల్లో పనిచేసే వారికి ఇది వర్తించేది. ఈ అలవెన్స్‌ను గత నెల వరకు ఇస్తూ వచ్చారు. ఇకపై కొన్ని జిల్లాల్లో మినహా మిగిలినచోట్ల ఉండబోదని తాజాగా ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు మౌఖికంగా ఠాణాలకు సమాచారం అందించారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల గురించి కేంద్ర హోంశాఖ తాజాగా వెలువరించిన జాబితా ఆధారంగా కోత విధించినట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ ఇటీవల 11 రాష్ట్రాల్లోని 90 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి భద్రత సంబంధిత వ్యయం(ఎస్‌ఆర్‌ఈ) పథకం కింద నిధుల్ని విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ఆదిలాబాద్‌, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్‌ జిల్లాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న వారికి మాత్రం అలవెన్స్‌ ఇస్తూ మిగిలిన జిల్లాలకు కోత విధించారు. ఆ ఎనిమిది జిల్లాల్లోనూ మావోయిస్టు ప్రభావం అంతగా లేని కొన్ని ఠాణాలకు మినహాయింపు ఇచ్చారు. ఉదాహరణకు పెద్దపల్లి జిల్లాలో మూడు(మంథని, ముత్తారం, పొత్కపల్లి) పోలీస్‌స్టేషన్లకు మాత్రమే అలవెన్స్‌ వర్తింపజేస్తున్నారు.

ఎస్కార్ట్‌.. గన్‌మెన్లు ఎందుకు..?
క్షేత్రస్థాయి పోలీసులకు అలవెన్స్‌ను రద్దు చేయడంతో పోలీస్‌ వాట్సప్‌ గ్రూపుల్లో ఈ అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. ‘తెలంగాణలో నక్సల్స్‌ లేరని పోలీసులకు ఇచ్చే 15 శాతం స్పెషల్‌ అలవెన్స్‌ తొలగించారు. బాగుంది.. కానీ, లేని నక్సల్స్‌ నుంచి రక్షణ కోసం రాజకీయ నాయకులకు, అధికారులకు ఎస్కార్ట్‌, గన్‌మెన్లు ఎందుకు..? అఫీసులకు, ఇళ్లకి గార్డులు ఎందుకు ?’ అంటూ సందేశాలు వైరల్‌గా మారాయి.

ఇదీ చదవండి:'అన్నారం' మోటార్లు బయటపడ్డాయ్‌.. శుభ్రపరిచే పనులకు శ్రీకారం

ABOUT THE AUTHOR

...view details