కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ సమయంలో ఎవ్వరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్లు, ముఖ్య కూడళ్ల వద్ద నిరీక్షిస్తున్న ప్రయాణికులను పంపిస్తున్నారు. ప్రైవేటు వాహనాలను రహదారులపై రానివ్వకుండా పహారా కాస్తున్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం తమ సిబ్బందిని అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఎంజే మార్కెట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే... కఠిన చర్యలు తప్పవు - హైదరాబాద్‌లో కరోరా పరిస్థితి
కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో చేపట్టిన లాక్ డౌన్‌ను నగరంలో మరింత కఠినతరం చేశారు. రహదారులపైకి వచ్చే వాహనదారులను హెచ్చరిస్తూ జరిమానాలు విధిస్తున్నారు. వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే... కఠిన చర్యలు తప్పవు
మరోవైపు నిత్యావసర సరుకుల కోసం ఉదయం 7 గంటల నుంచే నగరవాసులు సమీపంలోని సూపర్ మార్కెట్లు, మాల్స్ వద్ద బారులుతీరారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే... కఠిన చర్యలు తప్పవు
ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా లాక్డౌన్... కరోనా కేసులు@471