ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్చి శబ్ద కాలుష్యానికి గురుచేస్తున్న వాహనదారులపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఇప్పటివరకూ మొత్తం 654 మందిపై కేసుల నమోదు చేశారు. ఇందులో ఎక్కువగా ప్రైవేటు ట్రావెల్ బస్సులు, స్కూల్ బస్సులే ఉన్నాయి. వారం రోజుల పాటు ఈ డ్రైవ్‌ను పోలీసులు నిర్వహించారు.
అనవసరంగా హారన్ కొడితే కేసు నమోదు - పోలీసుల
అవసరం లేనపుడు కూడా హారన్ కొడుతూ, వింత వింత శబ్దాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు పలువురు వాహన దారులు. వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
ఎయిర్ హారన్ కొట్టే 125 వాహనాలు, వివిధ రకాల హారన్ మోగిస్తున్న 424 వాహనాలు ఎక్కువగా ధ్వని చేస్తున్నాయన్నారు. శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న 105 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ మోత ఒక్కసారిగా వినిపించడంతో మిగిలిన వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మోటారు వాహన చట్టం కింద ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఎక్కడైనా ఇబ్బంది కరంగా హారన్లను మోగిస్తే తమకి సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఇదీ చూడండి : రమణీయంగా మారిన తెలంగాణ నయాగరా