ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

'అనుకున్న సమయానికి పోలవరం పనులు పూర్తి చేస్తాం' - polavaram project latest news

పోలవరం పనులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ వెల్లడించారు. ఆయన నేతృత్వంలోని బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. ఈ నెల 23 వరకు తాము ఇక్కడే ఉండి ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తామని అయ్యర్​ తెలిపారు.

'అనుకున్న సమయానికి పోలవరం పనులు పూర్తి చేస్తాం'
'అనుకున్న సమయానికి పోలవరం పనులు పూర్తి చేస్తాం'
author img

By

Published : Dec 20, 2020, 7:13 PM IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సంతృప్తికరంగా ఉన్నాయని ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అన్నారు. ఆయన నేతృత్వంలోని బృందం కాఫర్ డ్యాం, స్పిల్ వే క్రస్ట్ గేట్లు అమరిక పనులను పరిశీలించింది. ప్రాజెక్టు పనుల వివరాలను ఈ బృందానికి ఇంజినీర్లు వివరించారు. అనంతరం అయ్యర్ మీడియాతో మాట్లాడారు.

స్పిల్‌వేతో పాటు అన్ని పనులు నిర్ణీత కాలంలోనే పూర్తి చేస్తాం. మేము 4 రోజులు ఇక్కడే ఉండి పనులను పరిశీలిస్తాం. రేపు, ఎల్లుండి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో సహాయ పునరావాస చర్యలను పరిశీలిస్తాం. తర్వాత కుడి, ఎడమ కాలువల పనులతో పాటు అన్ని అంశాలనూ పరిశీలిస్తాం. ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో మంచి అవగాహనతో ముందుకెళ్తున్నాం. ఇదే స్ఫూర్తితో మా పని వేగాన్ని పెంచుతాం. షెడ్యూల్‌ ప్రకారం పనులన్నీ పూర్తి చేస్తాం.

- చంద్రశేఖర్ అయ్యర్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో

ఇదీ చదవండి:కేసీఆర్​కు భాజపా భయం పట్టుకుంది: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details