Polavaram Project Authority Meet : పోలవరం ప్రాజెక్టు అథారిటీ-పీపీఏ సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు పాల్గొంటారు. హైదరాబాద్‌లో ఉన్న పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరం తరలించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతున్న అంశంపై నేడు చర్చ జరగనుంది. పొలవరం బ్యాక్ వాటర్స్ కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముంపు ఏర్పడుతోందని.. ఆ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని.. తెలంగాణ కోరుతోంది.
నేడు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం.. హాజరుకానున్న ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు - Polavaram Project Authority Meeting
Polavaram Project Authority Meet :హైదరాబాద్‌లో నేడు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరగనుంది. సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి తెలంగాణ, ఏపీ ఇంజినీర్లు హాజరుకానున్నారు. ఈ భేటీలో పీపీఏ కార్యాలయం తరలింపుతో పాటుగా వివిధ అంశాలమీద చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
polavaram
ముంపు సమస్యలపై నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదిక కూడా ఇచ్చింది. 827ఎకరాల వరకు ముంపునకు గురవుతోందని, ఆ మేరకు పీపీఏ ద్వారా భూసేకరణ చేయాలని.. సూచించింది. ఇటీవల రెండు రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వే నిర్వహించారు. ఈ అంశంపైనా నేడు చర్చ జరగనుంది.
ఇవీ చదవండి: