తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ప్రారంభం.. ఇరు రాష్ట్రాల అధికారులు హాజరు

Polavaram Project Authority: హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ప్రారంభమైంది. సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల పలువురు ఇంజనీర్లు, అధికారులు హాజరయ్యారు.

Polavaram Project Authority
Polavaram Project Authority

By

Published : Nov 16, 2022, 1:08 PM IST

Polavaram Project Authority:పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశమైంది. హైదరాబాద్​లోని కృష్ణా గోదావరి భవన్‌లో పీపీఏ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో భేటీ జరుగుతోంది. ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఇంజనీర్లు సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర జలసంఘం ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

పీపీఏ కార్యాలయం రాజమహేంద్రవరానికి తరలింపు ప్రతిపాదన, బ్యాక్ వాటర్స్ ప్రభావం అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది. బ్యాక్ వాటర్స్ ప్రభావం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముంపు ఉంటోందని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. బ్యాక్ వాటర్‌ ప్రభావంపై స్వతంత్ర సంస్థతో సమగ్ర అధ్యయనం చేయాలని కోరుతోంది. 827 ఎకరాలకు పైగా భూమి ముంపునకు గురవుతోందని, పీపీఏ ద్వారా భూసేకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సూచించింది. రెండు రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వే కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details