తెలంగాణ

telangana

ETV Bharat / state

కొనసాగుతున్న పోలవరం ప్రాజెక్ట్​ హెడ్ వర్క్స్ పనులు - పోలవరం జిల్లా తాజా వార్తలు

ఏపీలోని పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ లో పనులు ఒక్కొకటిగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్ట్​లోని స్పిల్​వే వద్ద కీలకమైన స్టీల్ గడ్డర్ల్​ అమరిక పూర్తి అయింది. భారీ స్థాయిలో నిర్మిస్తున్న స్పిల్​ వే నిర్మాణంలో అదే స్థాయిలో భారీ గడ్డర్ల్​ వినియోగిస్తున్నారు. 60 రోజుల్లో 192 గడ్డర్​ను కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ అమర్చింది.

కొనసాగుతున్న పోలవరం ప్రాజెక్ట్​ హెడ్ వర్క్స్ పనులు
కొనసాగుతున్న పోలవరం ప్రాజెక్ట్​ హెడ్ వర్క్స్ పనులు

By

Published : Feb 21, 2021, 5:45 PM IST

పోలవరం ప్రాజెక్టులో.. స్పిల్ వే బ్రిడ్జి నిర్మాణంలో గడ్డర్లు కీలకం కావడంతో వాటిని అమర్చిన అనంతరం స్పిల్ వే బ్రిడ్జి నిర్మించనున్నారు. స్పిల్ వేపై గడ్డర్ల్​, షట్టరింగ్ పనులతో స్లాబ్ నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఒక్కోగడ్డర్​ను 23 మీటర్ల పొడవు, 2 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. మొత్తంగా ఒక్కో గడ్డర్ తయారీకి 10 టన్నుల స్టీల్, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించినట్టు అధికారులు వెల్లడించారు. ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు ఉంటుందని జలవనరుల శాఖ స్పష్టం చేసింది.

మొత్తం గడ్డర్ల తయారీకి 1920 టన్నుల స్టీల్, 4800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించినట్టు జలవనరుల శాఖ తెలిపింది. ఈ గడ్డర్ల్ను​ పిల్లర్లపై పెట్టడానికి రెండు భారీ క్రేన్లను వినియోగించినట్టు అధికారులు వెల్లడించారు. జులై నెలలో గోదావరికి భారీ వరదలు వచ్చినప్పటికీ స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం కొనసాగించేందుకు అవకాశం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:మాతృభాషలో బోధనతో దేశాభివృద్ధి: విద్యాసాగర్​రావు

ABOUT THE AUTHOR

...view details