తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోలవరం నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశం'

Polavaram construction: పోలవరం ప్రాజక్టు నిర్మాణం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలే ఉన్నాయని కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించింది. పోలవరం ప్రాజక్టుపై లోక్​సభలో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు కేశినేని నాని, లావు శ్రీకృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్‌లు అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజక్టు నిర్మాణం 2024 మార్చి నాటికి, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ 2024 జూన్‌ నాటికి పూర్తి కావాల్సి ఉందని అయితే... 2020, 2022 సంవత్సరాల్లో గోదావరికి వచ్చిన వరదల కారణంగా... ప్రస్తుత ప్రతిపాదిత షెడ్యూల్‌లో కొంత జాప్యం జరగవచ్చని మంత్రి సమాధానంలో తెలిపారు.

polavaram
polavaram

By

Published : Dec 8, 2022, 10:38 PM IST

Central Govt on Polavaram Project: పోలవరం ప్రాజక్టు నిర్మాణం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలే ఉన్నాయని కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించింది. 2024 మార్చి నాటికి పోలవరం ప్రాజక్టు పూర్తి కావాల్సి ఉన్నా.. వరదల కారణంగా జాప్యం జరుగుతున్నట్లు అంచనా వేశామని ఆ శాఖ పార్లమెంటుకు తెలిపింది. లోక్​సభలో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు కేశినేని నాని, లావు శ్రీకృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్‌లు అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజక్టు నిర్మాణం 2024 మార్చి నాటికి, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ 2024 జూన్‌ నాటికి పూర్తి కావాల్సి ఉందని, అయితే.. 2020, 2022 సంవత్సరాల్లో గోదావరికి వచ్చిన వరదల కారణంగా.. ప్రస్తుత ప్రతిపాదిత షెడ్యూల్‌లో కొంత జాప్యం జరగవచ్చని మంత్రి సమాధానంలో తెలిపారు.

ఇప్పటివరకు ప్రాజక్టులో స్పిల్‌వే, ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌-3, కాంక్రిట్‌ డ్యాం, ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌ గ్యాప్‌1 నిర్మాణాలు పూర్తి అయినట్లు మంత్రి వివరించారు. మరో ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం.. గ్యాప్‌1, 3ల నిర్మాణం, ప్రాజక్టు నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునరావాస కల్పన కార్యక్రమాలు వివిధ దశల్లో ఉన్నాయని సమాధానంలో పేర్కొన్నారు. ప్రాజక్టు నిర్మాణ పనులను పోలవరం ప్రాజక్టు అథారిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపింది. పనులు సకాలంలో పూర్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు నైపుణ్య సంస్థలు మద్దతు ఇస్తున్నాయని జలశక్తి శాఖ తెలిపింది.

2013-14 నాటి ధరల ప్రకారం ప్రాజక్టు నిర్మాణానికి 29,027.95 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిందని, 2017-18 నాటి ధరల ప్రకారం... ప్రాజక్టు నిర్మాణ వ్యయం అంచనా... 47,725.74 కోట్ల రూపాయలకు పెరిగిందని కేంద్రం తెలిపింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ స్థాయిలో.. ప్రాజక్టు వ్యయ అంచనాలను తయారు చేయలేదని కేంద్రం చెప్పింది. 2016 సెప్టెంబర్‌ 30 నాటి ఆర్ధిక శాఖ ఉత్తర్వుల ప్రకారం 2014 ఏప్రిల్‌ 1 నుంచి సాగునీటి ప్రాజక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చుని చెల్లిస్తున్నట్లు కేంద్రం వివరించింది. పోలవరం ప్రాజక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం నుంచి వచ్చిన సిఫారసులు, బిల్లుల ఆధారంగా.. చెల్లింపుల ప్రక్రియ జరుగుతోందని లిఖితపూర్వక సమాధానంలో జలశక్తి శాఖ పేర్కొంది.

పోలవరాన్ని జాతీయ ప్రాజక్టుగా ప్రకటించిన నాటి నుంచి ఇప్పటివరకు 13,226.043 కోట్ల రూపాయలు కేంద్రం తిరిగి చెల్లించిందని, ఆ తర్వాత ఎపీ ప్రభుత్వం చెల్లింపుల కోసం పీపీఎకి 483 కోట్ల రూపాయల బిల్లులు సమర్పించిందని పేర్కొంది. ప్రాజక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు విజ్ఞాపనలు కూడా వచ్చినట్లు జలశక్తి శాఖ వెల్లడించింది. ప్రాజక్టు నిర్మాణం వల్ల.. లక్షా ఆరు వేల ఆరు కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నందున.. వారికి రెండు దశల్లో.. పునరావాస కల్పన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కేంద్రం తెలిపింది. తొలిదశలో 41.15 మీటర్ల నీటి స్టోరేజి వరకు నిర్వాసితులవుతున్న ఇరవై వేల 946 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని లక్ష్యం నిర్ధేశించుకుని.. వారిలో పదకొండు వేల 306 కుటుంబాలకు కల్పించినట్లు తెలియజేసింది.

పోలవరం ప్రాజక్టులో పనుల్లో హెడ్‌వర్క్స్‌లో మట్టిపనులు 74.46 శాతం, కాంక్రీట్‌ పనులు 81.71 శాతం, ఉక్కుకు సంబంధించిన పనులు 79.79 శాతం పూర్తైనట్లు కేంద్రం తన సమాధానంలో తెలిపింది. కుడి ప్రధాన కాలువ మట్టిపనులు వంద శాతం పూర్తి కాగా... లైనింగ్‌ పనులు 93.61 శాతం, నిర్మాణాలు 83.92 శాతం, ఎడమ ప్రధాన కాలువలో మట్టి పనులు 91.80 శాతం, లైనింగ్‌ పనులు 71.91 శాతం, నిర్మానాలు 40.13 శాతం జరిగినట్లు తెలిపింది. సహాయ పునరావాస కార్యక్రమంలో తొలిదశలో 53.98 శాతం జరిగినట్లు కేంద్రం సమాధానంలో వివరించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details