కరోనా కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో.. కవులు, గాయకులు ప్రజలకు వైరస్‌పై అవగాహన కల్పించేందుకు ముందుకు వస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన దాదాపు 40 మంది కవులు... కొవిడ్- 19 నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కవితల రూపంలో సంపుటిని రూపొందించారు. ఈ సంపుటిలో కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయడం, లాక్‌డౌన్‌ను పాటించాలంటూ... సందేశమిచ్చారు.
కవితలు ప్రజలను చైతన్య పరుస్తాయి: మంత్రి అజయ్ - poetry on corona in khammam
కవుల నుంచి జాలువారిన కవితలు ప్రజలను చైతన్య పరుస్తాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో కవుల రచించిన కవితా సంపుటిని ఆయన ఆవిష్కరించారు.
'కవితలు ప్రజలను చైతన్యపరుస్తాయి'
కవితా సంపుటిని ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. కవులకు అభినందనలు తెలిపారు. కవుల నుంచి జాలువారిన కవితలు ప్రజలను చైతన్య పరుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: కరోనా టెస్ట్ కిట్ కోసం ఓ అమ్మ పోరాటం