Pocharam Srinivas Reddy comments on CM KCR : చావుకైనా సిద్ధం కానీ.. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న కేసీఆర్ లాంటి నాయకుడు నడిపే ప్రభుత్వానికి దూరం కావటానికి ఏ ఎమ్మెల్యే సిద్ధంగా లేరని సభాపతి పోచారం తేల్చి చెప్పారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని అసెంబ్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన పోచారం.. ప్రతి నేత అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలను కూలదోసే సంస్కృతి దేశానికి మంచిదికాదని హితవు పలికారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారు చేతులు కాల్చుకోక తప్పదని జోస్యం చెప్పారు.
"చావుకైనా సిద్ధమే కానీ.. కేసీఆర్ ప్రభుత్వానికి దూరమవ్వను" - assembly speaker pocharam srinivas reddy
Pocharam Srinivas Reddy comments on CM KCR : చావుకైనా సిద్ధమేకానీ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ లాంటి నాయకుడు నడిపే ప్రభుత్వానికి దూరం కావడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చాలని కొందరు చూస్తున్నారని.. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రాణం పోయే వరకు తాను కేసీఆర్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు. అంబేడ్కర్ వర్ధంతి పురస్కరించుకుని అసెంబ్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
"దేశంలోనే ఇంత మంచి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ గొప్ప లీడర్ తర్వాతే.. రాజకీయ నాయకుడు. ఒక మంచి లీడర్‌గా రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు.చావనన్న చస్తాం కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టి పోము. నా 47 ఏడేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ప్రభుత్వాలు చూశాను. చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా చేశాను. ఇప్పడు ఈ స్థాయిలో ఉన్నాను. కేసీఆర్ ప్రభుత్వంలో అందరూ.. ఆనందంగా ఉన్నారు. ఆనందంగా లేని వారు కొంత మంది ఉన్నారు. వాళ్లేప్పుడు ఆనందంగా ఉండరు ఇంకా. టీఆర్ఎస్ శాసనసభ్యులు ఎవ్వరూ కూడా డబ్బుకు అమ్ముడుపోయే రకం కాదు.ఈ రోజు అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా ఆయన ఆశయాలు దృష్టిలో పెట్టుకుని వారికి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా మనమందరం కలిసి పనిచేద్దాం" - పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనసభ స్పీకర్
ఇవీ చదవండి: