బ్రిటిష్ వారి కబంద హస్తాల నుంచి దేశాన్ని విడిపించి, దేశ ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన యోధుడు మహాత్మగాంధీ అని శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తన అహింసా మార్గంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహోన్నతమైన వ్యక్తిగా గాంధీ మారారని పేర్కొన్నారు.
'గాంధీ కలలను సాకారం చేసే దిశగా సాగుతున్నాం' - శాసనసభ ఆవరణలో మహాత్మా 151వ జయంతి వేడుకలు
భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి అని శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ స్ఫూర్తిని కాపాడే దృక్పథంతో ముందుకు వెళ్లాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని గాంధీజీ అన్నారని గుర్తు చేశారు. గాంధీ కలలను సాకారం చేసే దిశగా కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. మహాత్మా 151వ జయంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల చేసి నివాళులర్పించారు.
'గాంధీ కలలను సాకారం చేసే దిశగా సాగుతున్నాం'
మహాత్మగాంధీ 151వ జయంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సభాపతితోపాటు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ మండలి చీఫ్ విప్ బోడకంటి వెంకటేశ్వర్లు, లెజిస్లేటివ్ సెక్రటరీ వి.నరసింహాచార్యలు, పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :'కనీస మద్దతు ధర రద్దు చేయబోం.. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి'