Pocharam Srinivas Reddy Comments on Congress : ప్రభుత్వం హామీల అమలులో కాలయాపన చేస్తోందని, సమీక్షలు తప్ప ఫలితాలు లేవని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. దిల్లీ పర్యటనల పేరిట విలువైన సమయం వృథా చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కార్యాలయంలో జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులవుతోంది పాత పథకాలు రద్దు చేస్తున్నారు తప్ప కొత్త స్కీంల అమలు ఊసు లేదని మండిపడ్డారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక - పార్టీ వాణి బలంగా వినిపించే వారికే బీఆర్ఎస్ ఛాన్స్!
Pocharam Fire on Congress Government : గృహలక్ష్మి పథకం రద్దు చేశారని ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారుల పరిస్థితి ఏమిటని పోచారంప్రశ్నించారు. గృహలక్ష్మి లబ్దిదారులకు ఇందిరమ్మ పథకం కిందకు చేర్చి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణం తప్ప మరే హామీ అమలు కావడం లేదన్నారు. రైతు బంధు(Rythu Bandhu) ఇంకా ఎవరికీ సరిగా అందలేదని, రైతు రుణామాఫీ గురించి ఊసేలేదన్నారు. వడ్లకు బోనస్ ఏదని ప్రశ్నించారు. గెలిచినా ఓడినా తమది ప్రజాపక్షమేనని స్పష్టం చేశారు.
"ప్రజాపాలన దరఖాస్తులు కోటి 25 లక్షలు వరకు వచ్చాయి. దరఖాస్తుల పేరిట ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల మోచేతికి బెల్లం పెట్టి దాట వేసే వైఖరితో ప్రభుత్వం ఉంది. ఎన్నికల కోడ్ వచ్చ వరకు కాలయాపన చేసి హామీలను నేరవేర్చని ప్రక్రియ నడుస్తోంది. తక్షణమే హామీలపై ద్రుష్టి పెట్టాలి. పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామనే విశ్వాసం ఉంది."- పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ స్పీకర్
ప్రభుత్వ పథకాల రద్దుపై బీఆర్ఎస్ పోరుబాట- నిరసన కార్యక్రమాలకు నేతల పిలుపు
Pocharam on Praja Palana : రాష్ట్రంలో మళ్లీ యూరియా కొరత మొదలైందని, పోలీస్ స్టేషన్‌లో బస్తాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగ భృతి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని ప్రస్తుతం అలా చెప్పలేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో అన్నారని గుర్తు చేశారు. దీర్ఘకాలిక హామీలపై తాము అడగలేదని, తక్షణం పరిష్కారించాల్సిన సమస్యల గురించే మాట్లాడుతున్నామన్నారు. ప్రజలను మోసం చేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాని(Pocharam Srinivasa Reddy Comments)కి విజ్ఞప్తి చేశారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లలో భారీగా అవినీతి జరిగిందని విమర్శించారు.
సమీక్షల పేరుతో ప్రభుత్వం సమయాన్ని వృధా చేస్తోంది పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ - మాకూ అవకాశం ఇవ్వండి : బీఆర్ఎస్ఎల్పీ