తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనాతో కాస్త ఆలస్యం.. బ్యాంకు సేవలు ఇకపై వేగవంతం' - oriental and united banks merging to pnb

ఓరియంటల్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలవడంతో పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ మరింత శక్తివంతమైందని సీఈఓ మల్లికార్జున్ రావు తెలిపారు. కరోనాతో ఆలస్యమైన బ్యాంకుల మెర్జింగ్, ఆర్థిక కార్యకలాపాలను ఇక నుంచి వేగవంతం చేస్తామని ప్రకటించారు.

PNB CEO about Economic activities after lockdown
కరోనాతో ఆలస్యమైన బ్యాంకు కార్యకలాపాలు

By

Published : Oct 4, 2020, 11:21 AM IST

కరోనా వ్యాప్తి, లాక్​డౌన్​ వల్ల ఆలస్యమైన బ్యాంకుల మెర్జింగ్, ఆర్థిక కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తామని పంజాబ్​ నేషనల్ బ్యాంక్​ సీఈఓ మల్లికార్జున్ రావు తెలిపారు. ఇప్పటికే రెండు బ్యాంకుల బిజినెస్, సిబ్బంది ఇంటిగ్రేషన్ పూర్తయిందని.. మార్చి 31 కల్లా టెక్నికల్ ఇంటిగ్రేషన్ కూడా పూర్తి చేసి పూర్తిస్థాయిలో ఒకే బ్యాంకుగా సేవలందిస్తామని ప్రకటించారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభానికల్లా 8 శాతం వృద్ధిని సాధిస్తామని మల్లికార్జున్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పీఎన్‌బీకి ఉన్న 11వేల బ్రాంచీలను కొనసాగిస్తూ.. దక్షిణాది, పశ్చిమప్రాంతాల్లో నూతన శాఖల ఏర్పాటు దిశగా పనిచేస్తామని వెల్లడించారు. ఓరియంటల్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలవడంతో పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ మరింత శక్తివంతమైందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details