రోజువారీ జీవితంలో వాడే వస్తువుల్లో విదేశాల్లో తయారైనవి కాకుండా స్వదేశంలో తయారైనవే వినియోగించాలని.. అవి ఏయో వస్తువులనే చార్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు చెందిన వెంకట మురళీ ప్రసాద్ తయారుచేశారు. ఇతను తయారు చేసిన ఆత్మనిర్భర్ భారత్ చార్ట్‌ను ప్రధాని నరేంద్రమోదీ మెచ్చుకున్నారు. చార్ట్‌తో కూడిన ఓ లేఖ అందిందని.. అది చాలా ఆసక్తికరంగా ఉందని మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘లేఖలో రాసినట్లు ‘ఏబీసీ’ అంటే తనకుముందుగా అర్థంకాలేదని.. ఆ తర్వాత మురళీప్రసాద్ జతచేసిన పట్టిక చూశాక అది ‘ఆత్మనిర్భర్ భారత్ చార్ట్’ అని అర్థమైందని మోదీ వెల్లడించారు.
ప్రధాని మోదీ మెచ్చిన విశాఖ వాసి ఏబీసీ చార్ట్ - ఆత్మనిర్భర్ భారత్ పట్టిక
ఆత్మనిర్భర్ భారత్‌పై విశాఖ వాసి తయారు చేసిన చార్ట్‌ను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. ఏపీలోని విశాఖకు చెందిన వెంకట మురళీ ప్రసాద్.. ప్రధానికి రాసిన లేఖలో స్వదేశంలోనే తయారైనవే వినియోగించాలని.. అవి ఏయో వస్తువులనే చార్ట్‌ను రూపొందించారు. దీనిపై ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన ప్రత్యేకించి ప్రస్తావించారు.
![ప్రధాని మోదీ మెచ్చిన విశాఖ వాసి ఏబీసీ చార్ట్ abc chart](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10060729-559-10060729-1609338037376.jpg)
ఏబీసీ చార్ట్
పట్టికలో రోజువారీ ఏయో వస్తువులు వినియోగిస్తున్నారనేది కేటగిరీల వారీగా వివరించారు. ప్రతీరోజూ వాడే ఎలక్ట్రానిక్, స్టేషనరీ, వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులు ఇలా 49రకాల ఉత్పత్తుల్ని చార్టులో పేర్కొన్నారు. స్వదేశంలో దొరుకుతున్నప్పటికీ విదేశీ వస్తువులనే కొందరు ఇప్పటికీ వినియోగిస్తున్నట్లు తెలిపారు. 2021లో స్వదేశీ వస్తువులనే వినియోగించేందుకు తాను ప్రమాణం చేస్తున్నానని మోదీకి రాసిన లేఖలో మురళీ ప్రసాద్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యల్ని, చార్డులోని వివరాల్ని మన్‌కీబాత్‌లో మోదీ ప్రస్తావించారు.