PM Modi Tweet on Turmeric Board Telangana :రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు(Telangana Assembly Elections 2023) జరగనుండటంతో.. రాజకీయం వేడెక్కుతోంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ(BJP).. కేసీఆర్‌ను ఎలాగైనా ఈసారి గద్దె దించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్(BRS) వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ.. ఓటర్లను ఆకర్షించేందుకు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు చేస్తోంది. ఇందులో భాగంగానే పాలమూరు జిల్లాలో ప్రజాగర్జన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.
PM Modi at Palamuru Meeting 2023 :పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాన మంత్రి మోదీ.. పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరాలు కురిపించారు. ఎట్టకేలకు జాతీయ పసుపు బోర్డు(Turmeric Board) ప్రకటనతో పసుపు రైతుల కల నెరవేరినట్లయింది. దశాబ్దాలుగా పసుపు రైతులు చేస్తున్న పోరాటానికి శుభం కార్డు పడింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంపీ ధర్మపురి అర్వింద్.. సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు. అర్వింద్ ట్వీట్‌ను మోదీ రీట్వీట్ చేశారు.
PM Modi on Turmeric Farmers : 'మన రైతుల శ్రేయస్సు, సౌభాగ్యాలే ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత. జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా మన పసుపు రైతుల సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోవడం, వారికి తగిన మద్దతును అందించడమే మా లక్ష్యం. ముఖ్యంగా దీనిద్వారా నిజామాబాద్‌కు అందే ప్రయోజనాలు అపారం. మన పసుపు రైతులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు మేము ఎంతవరకైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం.' అని ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్(ట్విటర్)లో ఎంపీ అర్వింద్ పోస్టును రీపోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు.
'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని