PM Modi Telangana Tour Today : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ అగ్రనేతలు వేగవంతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. నేడు, రేపు, ఎల్లుండి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఆరు బహిరంగ సభలు, ఒక రోడ్ షోలో ప్రధాని పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1:25 గంటలకు దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కామారెడ్డికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:15నిమిషాలకు బహిరంగ సభకు హాజరవుతారు.
PM Modi Election Campaign in Telangana 2023 :అనంతరం 4:15నిమిషాలకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలో జరగనున్న తుక్కుగూడ బహిరంగసభలో పాల్గొంటారు. తర్వాత 7:35నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని.... అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజ్ భవన్‌కు వెళతారు. రాజ్‌భవన్‌లోనే రాత్రి బస చేయనున్నారు. రేపు ఉదయం 11:30కు కన్హా శాంతివనంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా 2:15కు తుఫ్రాన్‌లో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం నిర్మల్‌కు వెళ్లనున్న ప్రధాని... మధ్యాహ్నం 3:45కు బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడి నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని... సాయంత్రం 5:45నిమిషాలకు తిరుపతికి బయలుదేరతారు.
రాత్రి తిరుమలలో బస చేసి.. ఎల్లుండి ఉదయాన్నే స్వామి వారి దర్శనం చేసుకొని.. 1:30నిమిషాలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మహబూబాబాద్ చేరుకుని మధ్యాహ్నం 12:45 బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అవ్వగానే నేరుగా కరీంనగర్ బయలుదేరి.. 2:45నిమిషాలకు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:40కి హైదరాబాద్ చేరుకొని.. 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే రోడ్ షోలో మోదీ పాల్గొంటారు. మూడు రోజుల పర్యటన ముగించుకుని తిరిగి 6:25నిమిషాలకు దిల్లీకి తిరుగుపయనం అవుతారు.
JP Nadda Election Campaign In Telangana : బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ మధ్యాహ్నం 12:30కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హుజూర్‌నగర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు పబ్లిక్ మీటింగ్‌కు హాజరవుతారు. తర్వాత సికింద్రాబాద్ చేరుకొని.. 4:30నిమిషాలకు రోడ్ షోలో నడ్డా పాల్గొంటారు. అనంతరం.. 6 గంటలకు ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో రోడ్ షోకు హాజరై ప్రచారం చేస్తారు. రాత్రి 7గంటలకు ఐటీసీ కాకతీయ హోటల్‌లో పార్టీ ముఖ్యనేతలతో నడ్డా సమావేశమవుతారు. ఈ భేటీలో ప్రచార సరళి, విజయావకాశాలు తెలుసుకుంటూనే గెలుపు దిశగా చేపట్టాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
బీజేపీ అధికారంలోకి రాగానే - అవినీతికి పాల్పడిన వారందరినీ జైలుకు పంపిస్తాం : రాజ్‌నాథ్‌సింగ్