PM Modi Telangana Tour అక్టోబర్ 2న తెలంగాణకు మోదీ.. మహబూబ్‌నగర్, నిజామాబాద్ సభల్లో ప్రసంగం PM Modi Telangana Tour in October :శాసనసభ ఎన్నికల కార్యాచరణను బహుముఖ వ్యూహంతో.. ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ(TS BJP) నిర్ణయించింది. క్షేత్రస్థాయి కీలక కార్యాచరణకు ఈ నెలాఖరులోపు తుదిరూపు ఇచ్చి అక్టోబరు మొదటి వారంలో ప్రధాని సహా అగ్రనేతల సభలు, అభ్యర్థుల ప్రకటన వంటి కీలక అంశాలతో ఎన్నికల దిశగా అడుగులేసేందుకు సిద్ధమైంది. అక్టోబరు 2న..ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
Telangana BJP Election Plan 2023 : అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతోనూ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లోక్‌సభ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రాష్ట్ర నేతలతో సమావేశమై ఎన్నికల కార్యాచరణ ఖరారు చేస్తారని పార్టీ కీలకనేతలు తెలిపారు. గతంలో నిర్ణయించిన బస్సు యాత్రల స్థానంలో.. అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రధాని మోదీ సభలను రాజకీయ సభలుగానే పరిగణించాలని.. పార్టీ నిర్ణయించింది. అందుకే వాటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ నెల 28, 29, వచ్చే నెల 2 తేదీలను ప్రధాని పర్యటన కోసం రాష్ట్ర నేతలకు కేటాయించినా అక్టోబరు రెండుకే ప్రాధాన్యమిచ్చారు. మోదీ పర్యటన అనంతరం అమిత్‌షా, నడ్డాల సభలను రాష్ట్రంలో మరో రెండు ఉమ్మడి జిల్లాల్లో చేపడతారు.
Modi Telangana Tour on October 2nd : :ఈ నెల 26 నుంచి అక్టోబరు రెండవ తేదీ వరకు 119 అసెంబ్లీ నియోజవర్గాల మీదుగా మూడు మార్గాల్లో బస్సు యాత్రలను చేపట్టాలని పార్టీ తొలుత నిర్ణయించింది. ప్రస్తుతానికి వాటిని వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బస్సు యాత్రల స్థానంలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో మూడు, నాలుగు సభలను నిర్వహించాలని నిర్ణయించారు. సభల తేదీలను ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు.
DK Aruna on Congress 6 Guarantee Schemes : 'కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాదు.. ముందుగా ఆ మూడు హామీలు ఇవ్వాలి'
రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సభలను ప్రారంభించాలని.. ముఖ్యనేతలు, కేంద్రమంత్రులు, పార్టీ జాతీయ నాయకులు వీటిలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ అభ్యర్థుల జాబితాను అక్టోబరు మొదటివారంలో వెల్లడించడానికి సిద్ధమవుతున్నారు. నియోజకవర్గానికి ముగ్గురు లేదా నలుగురి పేర్లను గుర్తించి.. సర్వేలు, పార్టీ నేతల అభిప్రాయాలు, వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారని పార్టీ నేతలు తెలిపారు.
Telangana Assembly Elections 2023 :మరోవైపు ముఖ్య నేతలంతా శాసనసభ ఎన్నికల బరిలో నిలవాల్సి ఉంటుందని పార్టీ జాతీయ నాయకత్వం సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సహా కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడం ఖాయమని తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో బూత్‌ల వారీగా ఎన్నికల సంసిద్ధత కార్యాచరణను.. ఈ నెల 29వ తేదీలోపు పూర్తి చేయనున్నారు.
ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నియమించిన నాయకులు నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ సెగ్మెంట్లలోని అన్ని బూత్‌లలో సంసిద్ధతను సమీక్షిస్తున్నారు. బూత్ కమిటీలు, మండల కమిటీలతో సమావేశమవుతూ ఎన్నికలకు ఎంతమేరకు సిద్ధంగా ఉన్నారనే అంశాలను పరిశీలిస్తున్నారు. సమస్యలుంటే పరిష్కరించడంపైనా దృష్టి సారించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జులు తమ రాష్ట్ర కమిటీకి సెగ్మెంట్ల వారీగా నివేదికలను అందచేయనున్నారు. ఎన్నికల రోడ్‌మ్యాప్‌ను క్షేత్రస్థాయి నుంచి సంసిద్ధం చేయడంలో ఇది కీలక ప్రక్రియగా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
Kishan Reddy Fires on Telangana Government : 'రాబోయే ఎన్నికల్లో చిన్నపొరపాటు చేసినా.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మర్చిపోవాల్సిందే'
BJP Leaders Nirasana Deeksha in Hyderabad : 'కేసీఆర్‌కు జమిలి ఎన్నికలు అంటే భయం పట్టుకుంది'