సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు - పుట్టిన రోజు వేడుకలు
ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో జవాన్ల మరణంతో ఆయన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు.
ట్విట్టర్లో
ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఫోన్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తనకు విషెష్ తెలిపిన ప్రముఖులకు గులాబీ దళపతి కృతజ్ఞతలు తెలిపారు.