ఎస్సీ వర్గీకరణపై దృష్టి సారించిన కేంద్రం - ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ప్రధాని ఆదేశం - SC Classification
Published : Nov 24, 2023, 10:32 PM IST
|Updated : Nov 24, 2023, 10:45 PM IST
22:27 November 24
ఎస్సీ వర్గీకరణపై దృష్టి సారించిన కేంద్రం - ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ప్రధాని ఆదేశం
PM Modi Order to Set up a Committee to Speed up SC Classification : ఎస్సీ రిజర్వేషన్లలో ఉప-వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి త్వరగా కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కేంద్రం కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌గౌబా, ఇతర సీనియర్ అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌కు సంబంధించి త్వరలో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
రిజర్వేషన్ల ఫలాలు తమకు అందటం లేదంటూ ఎమ్మార్పీఎస్ మూడు దశాబ్దాల నుంచి చేస్తున్న ప్రతి పోరాటంలో బీజేపీ వారికి అండగా నిలిచిందని మోదీ చెప్పారు. ఈ అన్యాయానికి వీలైనంత త్వరగా ముగింపు పలికేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఎస్సీలకు సాధికారత కల్పించడానికి సాధ్యమయ్యే అన్ని మార్గాలను అనుసరించే ఓ కమిటీని త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో త్వరగా కమిటీని ఏర్పాటు చేయాలని.. అధికారులకు ప్రధాని సూచించినట్లు తెలుస్తోంది.