PM Modi Hyderabad Tour Today నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ PM Modi Hyderabad Tour Today :అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీజేపీ.. అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ముందుకెళ్తోంది. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూనే.. అధికారంలోకి వస్తే చేపట్టే పనుల గురించి వివరిస్తోంది. అందులో భాగంగా ప్రధాని మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ఖమ్మం, ఆదిలాబాద్, సూర్యాపేట సభలకు కేంద్రం హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.
Modi Public Meeting in Hyderabad Today :అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటూ.. సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో అమిత్‌షా ప్రకటించారు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌లో బహిరంగ సభతో పాటు ఎల్బీ స్డేడియం వేదికగా బీసీ ఆత్మగౌరవ సభకు హాజరైన ప్రధాని మోదీ(Modi Attends BJP BC Atma Gourava Sabha).. బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్‌పై విమర్శస్త్రాలు సంధించారు. ఇవాళ మరోసారి ప్రధాని మోదీ.. రాష్ట్ర పర్యటనకి వస్తున్నారు.
ఢంకా భజాయించి చెబుతున్నా బీఆర్ఎస్ ఓటమి ఖాయం : ప్రధాని మోదీ
PM MODI Schedule Today : సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో.. ఎంఆర్పీఎస్ నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధానిమోదీ హాజరుకానున్నారు. సాయంత్రం నాలుగుజస గంటల 45 నిమిషాలకి బేంగంపేట విమానాశ్రయం చేరుకోనున్న మోదీ.. 5గంటలకు పరేడ్ మైదానంలో జరిగే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభాస్థలి(MADIGA Sub Castes Vishwarupa Sabha)కి చేరుకుంటారు. 5గంటల 45 నిమిషాల వరకు విశ్వరూప సభలో పాల్గొననున్న ప్రధానిమోదీ.. ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు.. బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈనెల 11న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ - షెడ్యూల్ ఇదే
PM Modi Announcement on SC Classification : సభ అనంతరం ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీకి తిరిగివెళ్తారు. వారం వ్యవధిలోనే ప్రధాని.. రెండోసారి హైదరాబాద్‌కు వస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మాదిగ విశ్వరూప మహాసభ ఏర్పాట్లను పరిశీలించిన.. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.. పోరాటం తుది దశకు వచ్చిందని తెలిపారు. ఆ సభ ద్వారా ప్రధాని మోదీ నుంచి కచ్చితమైన హామీ లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
"మాదిగ ఉపకుల సమితి సందర్భంగా మాకు అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు మొదటి నుంచి అండగా నిలబడ్డాయి. ప్రతి గ్రామంలో మాదిగ కుల సంఘేతర ప్రజలు కూడా తరలివచ్చి.. ఒక ధర్మం కోసం చేస్తున్న పోరాటంలో గెలుపు దిశగా పయనించేందుకు ముందుకు వచ్చాయి. సమాజంలో ఉండే అన్ని సంఘాలు కలిసి పనిచేసేందుకు కృషి చేస్తున్నాం." - మందకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
Vishwarupa Mahasabha of Madiga subcastes: ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాని రాక నేపథ్యంలో కేంద్ర బలగాలు పరేడ్ మైదానం పరిసర ప్రాంతాలను.. తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
96వ వడిలోకి అడ్వాణీ- ఇంటికి వెళ్లి మోదీ శుభాకాంక్షలు
'మహాదేవ్ పేరునూ కాంగ్రెస్ వదిలిపెట్టలేదు'- బెట్టింగ్ యాప్ కుంభకోణంపై ప్రధాని మోదీ ధ్వజం