- మీ పోరాటంలో న్యాయం ఉందని భావిస్తున్నాం: ప్రధాని మోదీ
- ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోదీ
- మీ హక్కుల సాధనలో మా తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తాం: మోదీ
- కోసం కమిటీ వేస్తాం..: ప్రధాని మోదీ
- మీతో కలిసి న్యాయపోరాటం చూస్తాం: ప్రధాని మోదీ
Live Updates : ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నాం-కమిటీ వేస్తాం : ప్రధాని మోదీ - ఎమార్పీఎస్ బహిరంగ సభలో మోదీ లైవ్ అప్డేట్స్
Published : Nov 11, 2023, 4:57 PM IST
|Updated : Nov 11, 2023, 7:03 PM IST
19:02 November 11
18:54 November 11
- మాదిగలకు అన్యాయం జరిగిందని మేం భావిస్తున్నాం: మోదీ
- బంగారు లక్ష్మణ్ మా పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు: మోదీ
- బంగారు లక్ష్మణ్ కింద గతంలో నేను పనిచేశా: ప్రధాని మోదీ
- బంగారు లక్ష్మణ్ నుంచి ఎంతో నేర్చుకున్నా.. ఆయన్ను గురువుగా భావిస్తా: మోదీ
- మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా నేను మీతో కలిసి పనిచేస్తా: మోదీ
- 30 ఏళ్ల పోరాటానికి నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ నిజమైన యోధుడు: మోదీ
- మందకృష్ణ మాదిగ తల్లిదండ్రులు ధన్యులు: ప్రధాని మోదీ
- ఇంతకాలం పాటు అహింసా మార్గంలో పోరాడటం గొప్ప విషయం: మోదీ
- మాదిగల ఉద్యమాన్ని గుర్తించా.. గౌరవిస్తా..: ప్రధాని మోదీ
- అహింసా మార్గంలో ఉద్యమించిన ప్రతి ఒక్కరికీ నమస్సులు: మోదీ
18:50 November 11
- లక్షలమంది దళిత విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించాం: ప్రధాని మోదీ
- బడుగువర్గాల బాగు కోసమే బీజేపీ ఎప్పుడూ పనిచేస్తోంది: మోదీ
- రైతులకు అండగా ఉండేందుకు వరికి మద్దతు ధర పెంచాం: మోదీ
- ఖరీఫ్‌లో తెలంగాణ రైతుల నుంచి 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొంటాం: మోదీ
- గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు కొనసాగిస్తాం
18:44 November 11
- కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయి: మోదీ
- పేదవాళ్లు అభివృద్ధి చెందాలనేదే మా నినాదం: ప్రధాని మోదీ
- కేంద్ర పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలే ఎక్కువ లబ్ధి పొందుతున్నాయి: మోదీ
- అవినీతికి పాల్పడటంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు: మోదీ
- బీఆర్ఎస్.. దిల్లీలోని ఆప్‌తో కలిసి మద్యం కుంభకోణానికి పాల్పడింది: మోదీ
18:41 November 11
- కాంగ్రెస్, బీఆర్ఎస్.. అవినీతి పార్టీలు: ప్రధాని మోదీ
- బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్‌తో కలిసి డ్రామాలు ఆడుతోంది: మోదీ
- దిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో కలిసి అవినీతి చేస్తున్నారు: మోదీ
- కాంగ్రెస్, బీఆర్ఎస్ పట్ల ప్రజలు అప్రమత్తం కావాలి: మోదీ
18:30 November 11
- దళితుల ఆశలపై నీళ్లు చల్లింది కేసీఆరే: ప్రధాని మోదీ
- దళితులకు మూడెకరాలు ఇస్తామన్నారు.. ఇవ్వలేదు..: ప్రధాని మోదీ
- దళితబంధు పథకం వల్ల బీఆర్ఎస్ నేతలకే మేలు జరిగింది: మోదీ
- బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. మాదిగ విరోధులు: ప్రధాని మోదీ
- కాంగ్రెస్ పార్టీ.. అంబేడ్కర్‌ను ఎన్నికల్లో రెండుసార్లు ఓడించారు: మోదీ
- కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్లో అంబేడ్కర్ చిత్రపటం కూడా పెట్టలేదు: మోదీ
- అంబేడ్కర్‌కు భారతరత్న కూడా ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ పార్టీ: మోదీ
- మేం వచ్చాకే అంబేడ్కర్ ఫొటో పెట్టాం.. భారతరత్న ఇచ్చాం..: మోదీ
- దళిత వ్యక్తి రాష్ట్రపతి కావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు: మోదీ
- దళిత బిడ్డ రామ్‌నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది: మోదీ
- దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్‌ను కాంగ్రెస్ అనేక రకాలుగా వేధించింది: మోదీ
- బిహార్ అసెంబ్లీలో దళితబిడ్డ జితన్‌రామ్ మాంఝీని అవమానించారు
- దళితులు అంటే బిహార్ సీఎం నీతీశ్కుమార్కు చిన్నచూపు: మోదీ
18:24 November 11
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తోంది: మోదీ
దళిత నేతను సీఎం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారు: మోదీ
అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చున్నారు: మోదీ
రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేశారు: ప్రధాని మోదీ
ప్రస్తుతం తెలంగాణ సంకట పరిస్థితిలో ఉంది: ప్రధాని మోదీ
తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడలేకపోయింది: మోదీ
18:19 November 11
- ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు: మోదీ
- మూడు దశాబ్దాల మాదిగల ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు: మోదీ
- పేదరిక నిర్మూలనే మా ప్రథమ ప్రాధాన్యం: ప్రధాని మోదీ
- మీ బాధలు పంచుకునేందుకే నేను ఇక్కడకు వచ్చా: ప్రధాని మోదీ
- న్యాయం చేస్తామని చెప్పి అనేక పార్టీలు మిమ్మల్ని వాడుకున్నాయి: మోదీ
- మీరంతా.. వన్ లైఫ్.. వన్ మిషన్లా పోరాటం చేశారు: మోదీ
18:14 November 11
- స్వాతంత్ర్యం వచ్చాక అనేక ప్రభుత్వాలను చూశారు: మోదీ
- ఆ ప్రభుత్వాలకు, మా ప్రభుత్వానికి తేడా గమనించాలి: మోదీ
- సబ్కా సాథ్.. సబ్కా వికాస్.. అనేది మా విధానం: మోదీ
- సామాజిక న్యాయం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం: మోదీ
- గుర్రం జాషువాను ప్రేరణగా తీసుకుంటున్నాం: ప్రధాని మోదీ
18:13 November 11
- తెలుగులో మాట్లాడి ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
- సమ్మక్క, సారమ్మను గుర్తు చేసిన ప్రధాని మోదీ
- ఇది అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ: మోదీ
- మందకృష్ణ మాదిగ.. నా చిన్న తమ్ముడు: ప్రధాని మోదీ
- తెలంగాణ మాదిగ సమాజానికి అభినందనలు: ప్రధాని మోదీ
- ఇంతగా ఆత్మీయత చూపించిన మాదిగ సమాజానికి ధన్యవాదాలు: మోదీ
- ఎంతో ప్రేమతో ఈ సభకు నన్ను ఆహ్వానించారు: ప్రధాని మోదీ
18:05 November 11
- మోదీ మాట ఇస్తే తప్పరని ప్రజల్లో బాగా విశ్వాసం ఉంది: మందకృష్ణ
- తమిళనాడులో ఎన్నికల్లో ఓడిన మురుగన్‌ను కేంద్రమంత్రి చేశారు: మందకృష్ణ
- ఈడబ్యూఎస్ రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత మోదీదే: మందకృష్ణ
- ఏళ్ల తరబడి కాంగ్రెస్ ఊరించిన మహిళా బిల్లును మోదీ తెచ్చారు: మందకృష్ణ
- ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం: మందకృష్ణ
- ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కరించాలని మోదీని కోరుతున్నా: మందకృష్ణ
- ఈ సభకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి కూడా అనేకమంది వచ్చారు: మందకృష్ణ
- ఎస్సీ వర్గీకరణ చేస్తే పార్టీలకు అతీతంగా మోదీకి అండగా ఉంటాం: మందకృష్ణ
- వర్గీకరణ చేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకు అండగా ఉంటాం: మందకృష్ణ
- పార్టీలకు అతీతంగా మాదిగలంతా మోదీకి అండగా ఉందాం: మందకృష్ణ
- మోదీ అంటే శత్రుదేశాలకు భయం.. మనదేశ ప్రజలకు అభయం..: మందకృష్ణ
17:57 November 11
- ఎస్సీలో మాదిగలకు అన్యాయం జరుగుతోంది: మందకృష్ణ
- మాదిగలకు అన్యాయం జరిగిందని అనేక కమిషన్లు చెప్పాయి: మందకృష్ణ
- విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతోంది: మందకృష్ణ
- ఎస్సీ వర్గీకరణ జరిగితేనే అంత్యోదయ ఫలాలు అందుతాయి: మందకృష్ణ
- ప్రధాని మోదీ గుండె గట్టిది.. మనసు మాత్రం వెన్నపూస..: మందకృష్ణ
- మోదీని మించిన నాయకుడు లేరు.. భవిష్యత్తులో రారు..: మందకృష్ణ
17:54 November 11
- ఇచ్చినమాటను నిలబెట్టుకునే నేత.. ప్రధాని మోదీ: మందకృష్ణ
బలహీనవర్గాల నుంచి వచ్చారు కనుకే మోదీకి మా కష్టాలు తెలుసు - కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మాదిగ వ్యక్తి లేరు: మందకృష్ణ
- తక్కువ జనాభా ఉన్న కులాలకు ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చారు: మందకృష్ణ
- కర్ణాటక నుంచి నారాయణస్వామిని కేంద్రమంత్రిని చేసిన ఘనత మోదీది
- ముస్లిం ఆడపిల్లల కష్టాలు తొలగించేందుకు ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చారు
17:47 November 11
ప్రధాని మోదీకి మొత్తం మాదిగలంతా చేతులెత్తి నమస్కరిస్తున్నాం
- కాంగ్రెస్, బీఆర్ఎస్.. కేవలం మాటలే చెబుతున్నాయి : మందకృష్ణ మాదిగ
- మా ఆకాంక్షలు నెరవేర్చేది బీజేపీనే.. : మందకృష్ణ మాదిగ
- బలహీనవర్గాలకు అండగా ఉండే పార్టీ బీజేపీనే.. : మందకృష్ణ మాదిగ
- తెలంగాణకు బీసీని సీఎంగా చేస్తామని ప్రకటించింది ఒక్క బీజేపీనే : మందకృష్ణ మాదిగ
- మోదీకి సామాజిక స్పృహ ఉంది కనుకే మా సభకు వచ్చారు : మందకృష్ణ మాదిగ
17:27 November 11
మహాసభ వేదికపై కంటతడి పెట్టిన మందకృష్ణ-ఓదార్చిన ప్రధాని మోదీ
- మహాసభ వేదికపై కంటతడి పెట్టిన మందకృష్ణ-ఓదార్చిన ప్రధాని మోదీ
17:08 November 11
మహాసభ వేదికపై కంటతడి పెట్టిన మందకృష్ణ-ఓదార్చిన ప్రధాని మోదీ
- ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నాయకుడు.. మోదీ: కిషన్‌రెడ్డి
- మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు: కిషన్‌రెడ్డి
- అన్ని వర్గాలకు న్యాయం జరగాలని అంబేడ్కర్ చెప్పారు: కిషన్‌రెడ్డి
- అన్ని వర్గాలకూ ఫలాలు అందాలనేదే మా విధానం: కిషన్‌రెడ్డి
16:56 November 11
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభ
- విశ్వరూప సభకు భారీగా తరలివచ్చిన ఎమ్మార్పీఎస్ శ్రేణులు
- తెలుగు రాష్ట్రాల నుంచి సభకు తరలివచ్చిన ఎమ్మార్పీఎస్ శ్రేణులు
- సభాస్థలికి చేరకున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
- సభాస్థలికి చేరుకున్న ఈటల రాజేందర్, భాజపా నేత బంగారు శృతి
- సికింద్రాబాద్‌లో కాసేపట్లో విశ్వరూప సభకు రానున్న ప్రధాని మోదీ
14:10 November 11
మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో పాల్గొననున్న మోదీ
- కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని మోదీ
- సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఎమార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభ
- మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో పాల్గొననున్న మోదీ