తెలంగాణ

telangana

ETV Bharat / state

PM Hyd Tour Live Updates: హైదరాబాద్‌ నుంచి చెన్నై బయలుదేరిన ప్రధాని మోదీ - undefined

pmlive
pmlive

By

Published : May 26, 2022, 1:02 PM IST

Updated : May 26, 2022, 4:11 PM IST

16:10 May 26

హైదరాబాద్‌ నుంచి చెన్నై బయలుదేరిన ప్రధాని మోదీ

  • హైదరాబాద్‌ నుంచి చెన్నై బయలుదేరిన ప్రధాని మోదీ
  • బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై పయనం
  • ప్రధానికి వీడ్కోలు పలికిన తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

15:33 May 26

ఐఎస్‌బీ నుంచి బేగంపేటకు చేరుకున్న ప్రధాని

  • హైదరాబాద్‌: ఐఎస్‌బీ నుంచి బేగంపేటకు చేరుకున్న ప్రధాని
  • హెలికాప్టర్‌లో బేగంపేటకు వెళ్లిన ప్రధాని మోదీ
  • హైదరాబాద్‌: ఐఎస్‌బీ నుంచి హెచ్‌సీయూకు రోడ్డుమార్గాన ప్రధాని
  • హెచ్‌సీయూ నుంచి హెలికాప్టర్‌లో బేగంపేటకు చేరుకున్న ప్రధాని మోదీ

15:12 May 26

రిఫార్మ్‌, పర్ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది: ప్రధాని

  • వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో సమన్వయం చేసుకోవాలి: ప్రధాని
  • యువత ఆలోచనలను దేశ పురోభివృద్ధి కోసం ప్రభుత్వం కృషిచేస్తుంది: ప్రధాని
  • రిఫార్మ్‌, పర్ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది: ప్రధాని
  • విద్యార్థులు బయటకు వచ్చాక పాలసీ విధానాలు రూపొందిస్తారు: ప్రధాని
  • పాలసీ విధానాలు గదుల్లో, కాగితాలకు మాత్రమే పరిమితం కావద్దు: ప్రధాని
  • రూపొందించిన విధానాలు క్షేత్రస్థాయిలో అమలైతేనే సార్థకత ఉంటుంది: ప్రధాని
  • దేశంలో సంస్కరణల అవసరం ఎప్పుడూ ఉంటుంది: ప్రధాని

15:02 May 26

స్టార్టప్‌లు, సేవా రంగంలో యువత సత్తా చాటుతున్నారు: ప్రధాని

  • విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధిలో భారత్‌ పురోభివృద్ధి సాధిస్తోంది: ప్రధాని
  • గతేడాది భారత్‌కు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయి: ప్రధాని
  • వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి: ప్రధాని
  • ఈ ఘనతలన్నీ ప్రభుత్వం ప్రయత్నాల వల్ల మాత్రమే సాధ్యం కాలేదు: ప్రధాని
  • భారత్‌ సాధించిన ఘనతలో ఐఎస్‌బీ విద్యార్థులు, యువకుల పాత్ర ఉంది: ప్రధాని
  • స్టార్టప్‌లు, సేవా రంగంలో యువత సత్తా చాటుతున్నారు: ప్రధాని
  • యువత దేశాన్ని ఏలే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు: ప్రధాని
  • భారత ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది: ప్రధాని
  • ప్రపంచవ్యాప్త సమస్యలకు పరిష్కార మార్గాలు భారత్‌లో లభిస్తున్నాయి: ప్రధాని

14:55 May 26

స్టార్టప్‌ల రూపకల్పనలో భారత్‌ మూడో స్థానంలో ఉంది: ప్రధాని

  • జీ 20 దేశాల్లో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది: ప్రధాని
  • స్మార్ట్‌ఫోన్‌ డేటా వినియోగదారుల జాబితాలో దేశం అగ్రస్థానంలో ఉంది: ప్రధాని
  • అంతర్జాల వినియోగదారుల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో ఉంది: ప్రధాని
  • స్టార్టప్‌ల రూపకల్పనలో భారత్‌ మూడో స్థానంలో ఉంది: ప్రధాని
  • వినియోగదారుల మార్కెట్‌లో భారత్‌ మూడో స్థానంలో ఉంది: ప్రధాని
  • కరోనా విపత్తు వేళ భారత్‌ సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది: ప్రధాని
  • కరోనా కారణంగా గొలుసు సరఫరా వ్యవస్థ దెబ్బతింది: ప్రధాని

14:48 May 26

ఐఎస్‌బీ హైదరాబాద్‌ మరో మైలురాయి అందుకుంది: ప్రధాని

  • ఐఎస్‌బీ హైదరాబాద్‌ మరో మైలురాయి అందుకుంది: ప్రధాని
  • ఐఎస్‌బీ నుంచి ఇప్పటివరకు 50 వేల మంది బయటకు వెళ్లారు: ప్రధాని
  • ఐఎస్‌బీ విద్యార్థులు దేశానికి గర్వకారణం: ప్రధాని మోదీ
  • ఇక్కడి విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు: ప్రధాని
  • ఇక్కడ చదివిన విద్యార్థులు అనేక స్టార్టప్‌లు రూపొందించారు: ప్రధాని
  • 25 ఏళ్ల నాటి సంకల్పానికి మీ అందరిదీ ముఖ్య పాత్ర: ప్రధాని

14:42 May 26

ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ చిహ్నం ఆవిష్కరించిన ప్రధాని మోదీ

  • ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ చిహ్నం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
  • ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పతకాలు ప్రదానం చేసిన ప్రధాని
  • ఐఎస్‌బీ స్కాలర్లకు ఎక్సలెన్స్‌, లీడర్‌షిప్‌ అవార్డులు
  • ఐఎస్‌బీ స్కాలర్లు అభిజిత్‌, భరద్వాజ్‌, వైదేహీకి గోల్డ్‌ మెడల్స్‌ ప్రదానం
  • ఐఎస్‌బీ స్కాలర్లు విక్రమ్‌ సింగ్‌, ఉత్కర్ష్‌, ప్రదీప్‌కు గోల్డ్‌ మెడల్స్‌ ప్రదానం
  • విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ ప్రదానం చేసిన ప్రధాని మోదీ
  • రాఘవ్‌ చోప్రాకు హైదరాబాద్‌ క్యాంపస్‌ ఛైర్‌పర్సన్‌ అవార్డు

14:39 May 26

ఐఎస్‌బీ వార్షికోత్సవానికి హాజరైన ప్రధాని మోదీ

  • హైదరాబాద్‌: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 20వ వార్షికోత్సవం
  • హైదరాబాద్‌: ఐఎస్‌బీ వార్షికోత్సవానికి హాజరైన ప్రధాని మోదీ
  • ఐఎస్‌బీ వార్షికోత్సవానికి హాజరైన గవర్నర్‌ తమిళిసై
  • ఐఎస్‌బీ వార్షికోత్సవానికి హాజరైన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి
  • ఐఎస్‌బీ వార్షికోత్సవానికి హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్‌

14:05 May 26

ఐఎస్‌బీకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

  • గచ్చిబౌలిలోని ఐఎస్‌బీకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • ఐఎస్‌బీ ప్రాంగణంలో మొక్క నాటిన ప్రధాని మోదీ
  • హైదరాబాద్‌: ఇండియన్‌ స్కూల్‌ బిజినెస్‌ 20వ వార్షికోత్సవం
  • హైదరాబాద్‌: ఐఎస్‌బీ వార్షికోత్సవానికి హాజరైన ప్రధాని మోదీ

13:33 May 26

మేం పారిపోయే వాళ్లం కాదు, పోరాడే వాళ్లం: ప్రధాని మోదీ

  • భారత ఆర్థిక వ్యవస్థగా వేగంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ
  • దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకెళ్తున్నాం: ప్రధాని
  • ఈ 8 ఏళ్లల్లో వేల స్టార్టప్‌లను ప్రోత్సహించాం: ప్రధాని మోదీ
  • నాకు టెక్నాలజీ పైన అపారమైన నమ్మకం ఉంది: ప్రధాని మోదీ
  • నేను సాంకేతికతను నమ్ముతాను, అంధ విశ్వాసాలను నమ్మను: ప్రధాని
  • అంధవిశ్వాసులతో తెలంగాణకు ప్రయోజనం లేదు: ప్రధాని
  • కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాలి: ప్రధాని
  • 2024లో విముక్తి కలుగుతుందనే నమ్మకం నాకుంది: ప్రధాని
  • మేం పారిపోయే వాళ్లం కాదు, పోరాడే వాళ్లం: ప్రధాని మోదీ
  • భాజపా కార్యకర్తలు తగ్గే వాళ్లు కాదు, నెగ్గే వాళ్లు: ప్రధాని మోదీ

13:29 May 26

తెలంగాణలో కుటుంబ పాలన అంతా అవినీతిమయం: ప్రధాని

  • తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష: ప్రధాని
  • కుటుంబ పార్టీలను తరిమిస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి: ప్రధాని
  • తెలంగాణ అభివృద్ధి కోసం ఎంత పోరాటమైనా చేస్తాం: ప్రధాని
  • యువతతో కలిసి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తాం: ప్రధాని
    తెలంగాణలో అధికార మార్పిడి తప్పక జరిగితీరుతుంది: ప్రధాని
  • తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చితీరుతుంది: ప్రధాని
  • తెలంగాణలో భాజపా హవా కనిపిస్తోంది: ప్రధాని మోదీ
  • సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ సూత్రంతో భాజపా పనిచేస్తోంది: ప్రధాని
  • కుటుంబ పాలన, అవినీతి వల్ల అభివృద్ధి జరగట్లేదు: ప్రధాని
  • తెలంగాణలో కుటుంబ పాలన అంతా అవినీతిమయం: ప్రధాని
  • తెలంగాణ ప్రజలు ఎంత సమర్థులో నాకు తెలుసు: ప్రధాని

13:09 May 26

పట్టుదలకు, పౌరుషానికి మారు పేరు తెలంగాణ ప్రజలు: మోదీ

  • పట్టుదలకు, పౌరుషానికి మారు పేరు తెలంగాణ ప్రజలు: మోదీ
  • నేను ఎప్పుడు తెలంగాణకు వచ్చిన అపూర్వ స్వాగతం పలికారు: ప్రధాని
  • తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు: ప్రధాని మోదీ
  • తెలంగాణ కోసం అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా: మోదీ
  • తెలంగాణ అభివృద్ధి కోసం భాజపా కార్యకర్తలు కృషి చేస్తున్నారు: ప్రధాని
  • భారత దేశ ఐక్యత కోసం సర్దార్‌ పటేల్‌ ఎంతో కృషి చేశారు: ప్రధాని
  • టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ ఎదుగుతోంది: ప్రధాని మోదీ
  • తెలంగాణ ఉద్యమంలో వేల మంది అమరులయ్యారు: ప్రధాని
  • ఒక ఆశయం కోసం వేల మంది ప్రాణత్యాగాలు చేశారు: మోదీ
  • అమరుల ఆశయాలు తెలంగాణలో నెరవేరటం లేదు: ప్రధాని
  • ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యింది: ప్రధాని
  • నిరంకుశ తెలంగాణలో ఎవరి ఆశయాలు నెరవేరటం లేదు: ప్రధాని
  • కేవలం ఒక కుటుంబం కోసం తెలంగాణ ఏర్పాటు జరగలేదు: ప్రధాని

13:05 May 26

బేగంపేటలో స్వాగతసభ ఏర్పాటు చేసిన భాజపా నేతలు

  • బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ప్రధాని మోదీ
  • ప్రధానికి స్వాగతం పలికిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్
  • బేగంపేటలో స్వాగతసభ ఏర్పాటు చేసిన భాజపా నేతలు
  • భాజపా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

09:20 May 26

హైదరాబాద్ చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ

  • బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ప్రధాని మోదీ
  • ప్రధానికి స్వాగతం పలికిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్
  • కాసేపట్లో ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోదీ
  • బేగంపేట నుంచి గచ్చిబౌలికి హెలికాప్టర్‌లో వెళ్లనున్న మోదీ
  • ఐఎస్‌బీ విద్యార్థులను ఉద్ధేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
  • పీజీలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన విద్యార్థులకు పతకాలు అందజేత
  • మధ్యాహ్నం 3.50 గం.కు చెన్నైకి వెళ్లనున్న ప్రధాని మోదీ
  • ప్రధానికి వీడ్కోలు పలకనున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌
Last Updated : May 26, 2022, 4:11 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details