అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌పై కోర్టు ధిక్కార చర్యలు కోరుతూ పిటిషన్ దాఖలైంది. అయోధ్యలో 'భూమి పూజ' కార్యక్రమానికి ముందు ఓ జాతీయ మీడియాలో సుప్రీంకోర్టు వైఖరిని తప్పుబడుతూ ఓవైసీ ప్రకటన చేయడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఇండియా అధ్యక్షుడు వీరేశ్ షాండిల్య సహా ఓ న్యాయవాది అసద్‌పై కోర్టు చర్యలు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతున్నారు...
రామ మందిరం వివాదంపై సుప్రీం తీర్పు ప్రకటించిన అనంతరం కోట్లాది మంది హిందువుల మనోభావాలు, విశ్వాసాన్ని ఏ మాత్రం లెక్కచేయకుండా నిరాధారమైన ప్రకటనలు గుప్పించారంటూ పిటిషన్లో పేర్కొన్నట్లు వీరేశ్ పేర్కొన్నారు. అలాంటి కవ్వింపు మాటలతో ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని తెలిపారు.