ప్రపంచమంతా ప్లాస్టిక్ నియంత్రణపై మల్లగుల్లాలు పడుతుంటే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ప్లాస్టిక్ వల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదంటున్నాడు. ప్లాస్టిక్ పునర్వినియోగంపై ఎన్నో అధ్యయనాలు చేసి వాటితో డీజిల్, పెట్రోల్, కిరోసిన్‌ను ఉత్పత్తి చేస్తున్నాడు. ఇప్పటి వరకు 2 వేల టన్నుల ప్లాస్టిక్‌ను ఇంధనంగా మార్చిన ఆయన... లీటరు పెట్రోల్, డీజిల్‌ను 55 రూపాయల నుంచి 60 రూపాయలకు విక్రయిస్తున్నాడు. ఈ ప్రక్రియలో వెలువడే కార్బన్‌ను పొలాల్లో భూసారం పెంచేందుకు రైతులకు ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అతనే బీహెచ్ఈఎల్ ఆర్సీపురంలోని హైడ్రాక్సీ సిస్టమ్స్ సంస్థ నిర్వాహకులు బి.వి. సతీష్ కుమార్. ఆయనతో ఈటీవీ భారత్ ప్రతినిధి సతీష్ ప్రత్యేక ముఖాముఖి.
ప్లాస్టిక్ నుంచి పెట్రోల్ తీస్తున్న ఔత్సాహికవేత్త.. - fuel prodution with plastic covers
ప్లాస్టిక్‌తో సమస్త జీవరాశులకు, మానవ మనుగడకు ప్రాణహాని అని తెలిసినా వాడాల్సిన పరిస్థితి నేడు.. అదే ప్లాస్టిక్‌ని పునర్వినియోగిస్తూ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన సతీష్ కుమార్.
![ప్లాస్టిక్ నుంచి పెట్రోల్ తీస్తున్న ఔత్సాహికవేత్త.. hyderabad plastic](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5497893-348-5497893-1577345049373.jpg)
hyderabad plastic
ప్లాస్టిక్ నుంచి పెట్రోల్ తీస్తున్న ఔత్సాహికవేత్త..
ఇవీ చూడండి: సైనికుల కోసం... విద్యార్థుల వినూత్న యత్నం!