ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగ రాష్ట్రంలో మొదటి కరోనా పాజిటివ్ వ్యక్తి నుంచి గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్లాస్మా సేకరించారు. కరోనా వ్యాధితో వెంటిలేటర్ మీజ ఉన్న ఇతర వ్యాధిగ్రస్తులకు ప్లాస్మా ద్వారా చికిత్స అందించేందుకు వైద్యులు సన్నద్ధమయ్యారు.
రాష్రంలో మొదటి కరోనా పాజిటివ్ వ్యక్తి ప్లాస్మా సేకరణ - corona update
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా బాధితుల నుంచి వైద్యులు ప్లాస్మా సేకరిస్తున్నారు. రాష్ట్రంలో మొదటి పాజిటివ్ వ్యక్తి నుంచి ప్లాస్మా నమూనాలు సేకరించారు.

రాష్రంలో మొదటి కరోనా పాజిటివ్ వ్యక్తి ప్లాస్మా సేకరణ
ఇవాళ మరో ఇద్దరి నుంచి గాంధీ డాక్టర్లు ప్లాస్మా సేకరించారు. ఇప్పటి వరకూ నలుగురు కరోనా బాధితుల నుండి ప్లాస్మాను సేకరించినట్లు వైద్యులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా.... కరోనా బాధితుల నుంచి ప్లాస్మాను సేకరిస్తున్నారు.