ప్లాస్మా నిధి ఏర్పాటుకు తాను సిద్ధమని... ఇందుకు అనుమతివ్వాలని తెలంగాణ ప్లాస్మా దాతల సంఘం అధ్యక్షుడు, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్లాస్మా నిధి గురించి 4 నెలల కిందట ఏప్రిల్ 6న ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ ప్రస్తావించి... ఇప్పటి వరకూ దాని ఊసే ఎత్తలేదని నారాయణ రెడ్డి గుర్తు చేశారు. ప్రాణాంతకరమైన కరోనాను మంత్రి కేటీఆర్ తక్కువగా అంచనా వేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ థెరపీ ప్రోత్సాహకరం...
ప్లాస్మా థెరపీ చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తోందని ఆయన వెల్లడించారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడే మార్గాలను ఎంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తెలంగాణ ప్లాస్మా దాతల అసోసియేషన్ ఏర్పాటు చేసి... వందల మంది ప్లాస్మా దానం చేసేందకు ప్రోత్సాహించానన్నారు.