కరోనా రోగులకు ప్లాస్మా కోసం సైబరాబాద్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని సైబారాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ప్లాస్మా దానం చేయాలనుకున్నా... కావాలనుకున్నా.... సంప్రదించాలని సజ్జనార్ కోరారు.
ప్లాస్మాకోసం సైబరాబాద్లో కంట్రోల్ రూం: సీపీ సజ్జనార్
కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని... ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. మాస్క్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లొద్దని... కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు.
plasma control room
రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. మాస్కు ధరించడం... భౌతిక దూరం పాటించడం... చేతులను శానిటైజ్ చేసుకోవాలని సజ్జనార్ అన్నారు. మొదటి దశతో పోలిస్తే... రెండో దశలో కరోనా వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా.... అవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని... వేడుకలు, కార్యక్రమాల పేరుతో గుమిగూడొద్దని సజ్జనార్ తెలిపారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే లక్ష కరోనా పరీక్షలు: డీహెచ్