సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్(vinod kumar) ధన్యవాదాలు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 42కి పెంచడం హర్షణీయమన్నారు. పెండింగ్లో పేరుకుపోతున్న కేసుల సత్వర విచారణకు ఇదీ దోహదపడుతుందని వినోద్ అన్నారు. హైకోర్టులో జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 2019 ఫిబ్రవరిలో ప్రధాని, కేంద్ర న్యాయశాఖ మంత్రి, సీజేఐలకు లేఖలు రాశారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.
vinod kumar: సీజేఐకి కృతజ్ఞతలు తెలిపిన వినోద్ కుమార్ - హైదరాబాద్ తాజా వార్తలు
హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 42కి పెంచినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్(vinod kumar) ధన్యవాదాలు తెలిపారు. హైకోర్టులో జడ్జి పోస్టులను 24 నుంచి 42కి పెంచడం హర్షణీయమన్నారు.
vinod kumar: సీజేఐకి కృతజ్ఞతలు తెలిపిన వినోద్ కుమార్
జడ్జిల సంఖ్య పెంచాలని 2019లో తాను పార్లమెంటులో ప్రస్తావించడంతో పాటు కేంద్ర పెద్దలతో పలుమార్లు చర్చించినట్లు పేర్కొన్నారు. గత కొన్ని ఏళ్లుగా కోరుతున్న విధంగా హైకోర్టు జడ్జిలను 42కి పెంచడం పట్ల సీజేఈ జస్టిస్ ఎన్వీ రమణకు తెరాస న్యాయ విభాగం ధన్యవాదాలు తెలిపింది. కొత్తగా మంజూరైన జడ్జిల పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ అయ్యేలా చూడాలని సీజేఐని తెరాస లీగల్ సెల్ కోరింది.
ఇదీ చదవండి:uttam kumar: నేడు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ పంపుల వద్ద కాంగ్రెస్ నిరసనలు