యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూసిన చంద్రయాన్-2 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. చిట్ట చివరి దశలో విక్రమ్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. చివరి 15 నిమిషాలు ఎంతో ఉత్కంఠను రేపాయి. ప్రధాన మంత్రి కూడా ప్రయోగం విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. అయితే ఇప్పడు సంకేతాలు మాత్రమే ఆగిపోయాయని... ల్యాండర్ తన కృత్రిమ మేధస్సుతో లక్ష్యాన్ని చేరుకుంటుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి కొంత సమయం పడుతుందని అన్నారు. ఇది ఒక పాఠం మాత్రమేనని... భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేపట్టాల్సి ఉందని ప్లానెటరీ సొసైటీ ఫౌండర్ అండ్ డైరక్టర్ రఘునందన్ అన్నారు. ఇప్పుడు చంద్రయాన్-3 ప్రాజెక్టును ప్రకటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శాస్త్రవేత్తలు తప్పకుండా జాబిల్లిపై విజయం సాధిస్తారన్న రఘునందన్కుమార్తో ఈటీవీభారత్ ముఖాముఖి...
'చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైనట్లు కాదు' - చంద్రయాన్ 2 ప్రయోగం
చంద్రయాన్-2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండింగ్ సమయంలో కేవలం సాంకేతిక సమస్య మాత్రమే తలెత్తిందని... అది ప్రయోగం విఫలమైనట్లు కాదని ప్లానెటరీ సొసైటీ ఫౌండర్ అండ్ డైరక్టర్ రఘునందర్ కుమార్ అభిప్రాయపడ్డారు. చందమామపై వాతావరణ మార్పుల కారణంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చని అన్నారు. భవిష్యత్తులో మన శాస్త్రవేత్తలు జాబిల్లిపై విజయవంతంగా పరిశోధనలు పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
చంద్రయాన్ ప్రయోగం