పాతబస్తీలో అక్కన్న మాదన్న దేవాలయ ఘటం ఊరేగింపు నిరాడంబరంగా నిర్వహించారు. ప్రతీ సంవత్సరం బోనాల పండుగ మరుసటి రోజు దేవాలయ ప్రాంగణంలో రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత పోతరాజుల నృత్యాలు డప్పు వాయిద్యాల నడుమ ఏనుగు అంబారీపై అమ్మవారి ఘటం ఉరేగించడం ఆనవాయితీగా వస్తోంది.
సాదా సీదాగా అక్కన్న మాదన్న ఆలయ ఘటం ఊరేగింపు - అక్కన్న మాదన్న దేవాలయ ఘటం ఊరేగింపు
కొవిడ్ నిబంధనల మేరకు పాతబస్తీ అక్కన్న మాదన్న ఆలయంలో ఘటాల ఉరేగింపు నిర్వహించారు. ప్రతి ఏటా ఏనుగు అంబారీపై అమ్మవారి ఘటం ఉరేగించేవారు కానీ ఈసారి హడావిడి లేకుండా జరిపారు.
సాదా సీదాగా అక్కన్న మాదన్న ఆలయ ఘటం ఊరేగింపు
కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈసారి ఏనుగు అంబారీపై ఘటం ఉరేగింపుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అమ్మవారి ఘటాన్ని సాదా సీదాగా పోతురాజుల డప్పు వాయిద్యాల నడుమ సాగనంపారు.
ఇదీ చూడండి :మరోసారి భారీ విధ్వంసానికి ముష్కరుల కుట్ర!